Year Ender 2024: తొలి రోజు అత్యధిక వసూల్లు రాబట్టిన సినిమాలు ఇవే.. పుష్ప 2, కల్కి, దేవర ఏ స్థానంలో నిలిచాయంటే?
Year Ender 2024: మరో ఐదు రోజులలో ఈ ఏడాది ముగియబోతోంది. కొత్త ప్రణాళికలు, పథకాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంత సిద్ధమవుతున్నారు. గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. మరి కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ టాక్ తో డిజాస్టర్ గా మిగిలాయి. ఇలా సినిమా ఇండస్ట్రీ మిశ్రమ ఫలితాలను ఈ ఏడాది చూసింది. అయితే.. కొన్ని సినిమాలు మాత్రం తొలిరోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్ వసూలు చేసి నయా రికార్డులను క్రియేట్ చేశాయి. ఇంతకీ ఈ ఏడాది ఫస్ట్ డే రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కెయ్యండి.
పుష్ప 2 (Pushpa 2)
తొలి రోజు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలలో తొలుత చెప్పుకోవలసిన సినిమా పుష్ప 2 ది రూల్ . అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. మైత్రి మూవీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తొలి రోజు రూ. 288.5 కోట్ల గ్రాస్ గ్రాస్ ను రాబట్టింది. మూవీ మేకర్స్ మాత్రం రూ. 294 కోట్ల గ్రాఫ్ ను వసూలు చేసిందని వెల్లడించింది.

కల్కి 2898 ఏడి..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ సినిమా తొలి రోజు రూ. 191 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 2024లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా మొదటి ప్లేస్ లో నిలిచింది. కానీ పుష్ప 2 సినిమా రావడంతో.. ఈ సినిమా రెండో స్థానంలో నిలిచింది.
దేవర 1
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంభోలో తెరకెక్కిన సినిమా దేవర పార్ట్ 1. ఈ మూవీ ఎన్నో అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంచనాలకు తగ్గట్లుగానే తొలిరోజు రికార్డ్ స్థాయిలో రూ. 170 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇలా అత్యధిక వసూళ్లు చేసిన సినిమాలలో టాప్ 3 ప్లేస్ లో నిలిచింది ఎన్టీఆర్ దేవర.
గోట్ ( గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం)
తమిళ స్టార్ హీరో విజయ దళపతి, స్టార్ డైరెక్టర్ విక్రమ్ ప్రభు కాంబోలో తెరకెక్కిన సినిమా గోట్. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విజయ దళపతి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈ సినిమా కూడా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో టాప్ 4 లో నిలిచింది.
స్త్రీ 2
లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన స్త్రీ 2 మూవీలో శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా తొలిరోజు రూ. 91 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఇలా ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలలో 5 వ స్థానంలో నిలిచింది స్త్రీ 2.
గుంటూరు కారం
సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీ ఫస్ట్ డే రూ. 90 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో టాప్ 6 ప్లేస్ లో నిలిచింది.

వెట్టయాన్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా వెట్టయాన్. ఈ మల్టీస్టారర్ మూవీ కి క్రియేటివ్ డైరెక్టర్ జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు వల్డ్ వాయిస్ గా రూ. 68.35 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా ఫస్ట్ డే అత్యధికంగా వసూలు చేసిన సినిమాలలో 7 ప్లేస్ లో నిలిచింది వేటయాన్.
సింగం ఎగైన్
అజయ్ దేవ్ గణ్ హీరోగా అక్షయ్, రణ్ బీర్ కపూర్, టైగర్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ మల్టీ స్టారర్ గా తిరకెక్కిన సినిమా సింగం ఎగైన్. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మల్టీస్టారర్ మూవీ తొలి రోజు రూ. 64.5 కోట్లను వసూలు చేసి.. ఈ ఏడాది తొలి రోజు అత్యధికంగా కలెక్షన్స్ వసూల్లు చేసిన సినిమాగా టాప్ 8 ప్లేస్ లో నిలిచింది
భారతీయుడు 2
కమల్ హాసన్ హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భారతీయుడు 2. ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 58.10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ ఏడాది తొలి రోజు అత్యధికంగా కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది.
భూల్ భులయ్య 3
భూల్ భులయ్యా ఫ్రాంచైజీలో కార్తీన్ ఆర్యన్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా 'భూల్ భులయ్య 3'. ఈ సినిమా తొలి రోజు రూ. 55.25 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్ 10లో నిలిచింది.


Click it and Unblock the Notifications











