For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బూతు సినిమాకు భలే డిమాండ్.. రెండో రేజే ఆ ఫీట్.. ఏడు చేపల కథ కలెక్షన్ రిపోర్ట్

    |

    ఈ మధ్యకాలంలో బూతు సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. అగల్ట్ కంటెంట్ సినిమాలు చూడటం పట్ల ఆసక్తి చేపుతున్నారు నేటితరం ప్రేక్షకులు. అందుకే ఇటీవలే విడుదలైన 'ఏడు చేపల కథ' సినిమా నిర్మాతలకు కలిసొచ్చేలా దూసుకుపోతోంది. బూతు బొమ్మలకు మార్కెట్‌లో మాంచి గిరాకీ ఉందని నిరూపిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే 'ఏడు చేపల కథ' ఎంత రాబట్టిందో తెలిసి షాకవుతున్నాయి ట్రేడ్ వర్గాలు. వివరాల్లోకి పోతే..

    టీజర్, ట్రైలర్‌ల తోనే నెట్టింట సెన్సేషన్

    టీజర్, ట్రైలర్‌ల తోనే నెట్టింట సెన్సేషన్

    టీజర్, ట్రైలర్ లతోనే నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది 'ఏడు చేపల కథ'. పూర్తి అడల్ట్ కంటెంట్‌తో కట్ చేయబడిన ఈ వీడియోలు చూసి షేక్ అయిపోయారు నెటిజన్లు. గతంలో కూడా ఈ సినిమాకు సంబంధించి టీజర్, పోస్టర్స్ ద్వారా సంచలనం సృష్టించిన చిత్రయూనిట్ ట్రైలర్‌లో అంతకుమించి అన్నట్లుగా సన్నివేశాలు చూపించింది. మాస్ మసాలా, అడల్ట్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో వెంటనే వైరల్ అయింది ఈ 'ఏడు చేపల కథ' ట్రైలర్.

    పక్కా అడల్ట్ కంటెంట్‌.. తొలి రోజే

    పక్కా అడల్ట్ కంటెంట్‌.. తొలి రోజే

    ఇలా పక్కా అడల్ట్ కంటెంట్‌తో వస్తున్నామని ముందుగానే చెప్పిన 'ఏడు చేపల కథ' చిత్ర యూనిట్ కమర్షియల్‌గా క్లిక్ అయ్యింది. A సర్టిఫికేట్ చిత్రాలను ఇష్టపడే అభిమానులు తొలి రోజే ఈ సినిమాకు నీరాజనం పలికారు. దీంతో ఈ మూవీకి పాజిటివ్ బజ్ ఏర్పడింది. భారీ ఎత్తున దాదాపు భారీగా 500 స్క్రీన్స్‌పై విడుదల చేయబడిన 'ఏడు చేపల కథ' మూవీ తొలి రోజే 1.9 కోట్లు కొల్లగొట్టింది.

    రెండో రేజే ఆ ఫీట్..

    రెండో రేజే ఆ ఫీట్..

    రసిక ప్రియులను ఎంటర్‌టైన్ చేస్తూ రెండో రోజు కూడా అదే జోష్ కంటిన్యూ చేసింది 'ఏడు చేపల కథ'. రెండో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర 90 లక్షలు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

    ఆదివారం మరింత కలిసొచ్చేనా..?

    ఆదివారం మరింత కలిసొచ్చేనా..?

    'ఏడు చేపల కథ' డిమాండ్ చూస్తుంటే మూడో రోజైన ఆదివారం మరింత కలిసొస్తుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇప్పటికే నిర్మాతలు సేఫ్ జోన్‌లో పడిన నిర్మాతలు ఇక ముందు లాభాల బాట పడతారని, మరోసారి టాలీవుడ్‌లో చిన్న సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నారు.

    English summary
    Yedu Chepala Katha movie running successfully in the theaters. Now this movie reached break even point
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X