twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏడు చేపల కథ collections: తొలిరోజే దుమ్మురేపిన వసూళ్లు.. బాక్సాఫీస్ దడదడ

    |

    రిలీజ్‌కు ముందు భారీ బజ్ క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏడు చేపల కథ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలిరోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అడల్ట్ కామెడీ చిత్రంగా వచ్చి పెద్ద సినిమాలు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓపెనింగ్స్ సాధించింది. దాంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను రేకేత్తించింది. అంతేకాకుండా ప్రిరిలీజ్ బిజినెస్‌ను మంచి వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకు ఈ చిత్రం తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే..

    మొదటి రోజు ఏపీ, తెలంగాణలో

    మొదటి రోజు ఏపీ, తెలంగాణలో

    ఏడు చేపల కథ సినిమా తొలి రోజు కలెక్షన్లు పరిశీలిస్తే.. నైజాంలో ఈ చిత్రం రూ.38 లక్షల షేర్, సీడెడ్‌లో రూ.21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.13లక్షలు, ఉభయ గోదావరి జిల్లాలో రూ.15 లక్షలు, గుంటూరులో రూ.7 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.7.4 లక్షలు, నెల్లూరులో రూ.5 లక్షలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా

    తొలిరోజే ఈ చిత్రం రూ.1 కోటికిపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం రూ.5 లక్షలు, ఓవర్సీస్‌లో 2 లక్షల కలెక్షన్లు నమోదు చేసింది. మొత్తంగా ఈ చిత్రం రూ.1.13 కోట్ల షేర్, 1.9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

    ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే

    ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే

    ఏపీ, తెలంగాణలో రూ.1.4 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకొంటే రూ.1.7 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ కావాలంటే 2.5 కోట్ల మేర వసూళ్లను రాబట్టాల్సి ఉండగా.. తొలిరోజే సగం వసూళ్లను కలెక్ట్ చేయడంతో డిస్టిబ్యూటర్లకు ఉపవమనం కలిగిందనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

    ప్రేక్షకులకు నిరాశే మిగిలింది...

    ప్రేక్షకులకు నిరాశే మిగిలింది...

    ఇక, ఏడు చేపల కథ చిత్రం టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొల్పింది. అడల్డ్ కంటెంట్ మోతాదుకు మించి ఉండటంతో య్యూట్యూబ్‌, సోషల్ మీడియాలో ఘనంగా వ్యూస్‌ను సొంతం చేసుకొన్నది. అయితే సెన్సార్ అడ్డంగా కత్తెర్లు వేయడంతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు భారీ నిరాశ ఎదురైంది. ఎందుకంటే టైటిల్స్‌లోనే ఏడు చేపల కథ రివైజ్డ్ అని పేర్కొనడం.. సీన్లు ఉంటాయని ఆశపడ్డ ప్రేక్షకులకు సెన్సార్ షాకిచ్చింది. దాంతో సినిమా కలెక్షన్లు రెండో రోజు అంతగా లేవనే మాట వినిపిస్తున్నది.

    English summary
    Yedu Chepala Katha movie got good opening in first day. Day 1 Collections are registered high note. As per trade report, the movie collected Rs1.13 crores share, 1.9 crores gross.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X