‘ఎవడు’ 4 డేస్ కలెక్షన్స్ ఏరియా వైజ్..
హైదరాబాద్: రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రం ఆదివారం విడుదలై కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతోంది. గడిచిన 4 రోజుల్లో ఈచిత్రం ఏపీలో రూ. 21 కోట్ల పైచిలుకు వసూలు చేసింది. ఇండియా వ్యాప్తంగా టోటల్ కలెక్షన్స్ 25 కోట్లు రాబట్టింది. ఏరియా వైజ్‌గా 'ఎవడు' కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
నైజాం: రూ. 6.65 కోట్లు
సీడెడ్: రూ. 4.80 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 2.15 కోట్లు
గుంటూరు: రూ. 2.32 కోట్లు
ఈస్ట్ గోదావరి: రూ. 1.79 కోట్లు
వెస్ట్ గోదావరి: రూ. 1.46 కోట్లు
కృష్ణా: రూ. 1.41 కోట్లు
నెల్లూరు: రూ. 1.26 కోట్లు
టోటల్ ఏపీ షేర్ : రూ. 21.84 కోట్లు
కర్నాటక : రూ. 2.51 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : రూ. 0.75 కోట్లు
టోటల్ ఇండియా షేర్: రూ. 25.1 కోట్లు

ఎవడు చిత్ర సక్సెన్‌ను అభిమానుల సమక్షంలో సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ మేరకు ఎవడు విజయయాత్ర తిరుపతి నుండి ప్రారంభించేందకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవడు సినిమా యూనిట్ అంతా ఈ విజయయాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
దిల్ రాజు మాట్లాడుతూ....'మా బేనర్లో నిర్మించిన 16వ సినిమా ఇది. సినిమా విడుదలైన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. ఈ సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎవడు సినిమాతో మీ ముందుకు వచ్చాం. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సందర్భంగా ఎవడు సక్సెస్‌ను అభిమానుల సమక్షంలోనే జరుపుకోబోతున్నాం. ఈ సక్సెస్ టూర్ తిరుపతి నుండి ప్రారంభిస్తున్నాం. శుక్రవారం నుండి అంటే 17వ తేదీన తిరుపతి నుంచి ఎవడు విజయయాత్ర ప్రారంభమౌతుంది. నెల్లూరు, ఒంగోలు, గుంటూరులో పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాతి రోజు అంటే శనివారం 18వ తేదీన విజయవాడ, భీమవరం, పాలకొల్లు, రాజమండ్రిలో విజయయాత్ర పూర్తి చేస్తాం. రామ్ చరణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డులు సాధించింది. కర్నాటక, తమిళనాడులోనూ అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రంగా ఎవడు నిలిచింది. శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులుండం వల్లే మాకు ఇంతటి ఘన విజయం దక్కింది అందుకే తిరుపతి నుండి ఈ సక్సెస్ టూర్ ప్రారంభిస్తున్నాం అన్నారు దిల్ రాజు.


Click it and Unblock the Notifications











