'ఎవడు' బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ డిటేల్స్
ఈ చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ చాలా బాగా జరిగిందని సమాచారం. దాంతో దిల్ రాజు చాలా ఉత్సాహంగా ఉన్నాడని తెలుస్తోంది. ఏయే ఏరియాలకు ఎవరు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకునే డిటేల్స్ ...
నైజాం - గీతా ఫిల్మ్స్ / దిల్ రాజు
సీడెడ్ - ఎన్వీ ప్రసాద్
నెల్లూరు - కృష్ణ మూవీస్
తూర్పు గోదావరి - గీతా ఫిల్మ్
పశ్చిమ గోదావరి - గీతా ఫిల్మ్
ఉత్తరాంధ్ర - దిల్ రాజు
కృష్ణ - కామాక్షి మూవీస్
గుంటూరు - దిల్ రాజు
కర్ణాటక - గీతా ఫిల్మ్
తమిళనాడు - సత్యం సినిమాస్
మిగిలిన ప్రాంతాలు - ఇండియన్ సినిమాస్
ఓవర్ సీస్ - మై 3 మూవీస్
నిర్మాత రాజు మాట్లాడుతూ "ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలూ పూర్తి చేశాం. జూలై మాసం మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిన మాసం. జూలై 24న విడుదలైన 'ఇంద్ర', 'తొలిప్రేమ' చిత్రాలు, జూలై 31న విడుదలైన 'మగధీర' ఎలాంటి సంచలన విజయాలు సాధించాయో తెలిసిందే. అదే కోవలో 'ఎవడు'ను కూడా జూలై 31న అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. రామ్‌చరణ్ నటన, శ్రుతి, అమీ అందాలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, వంశీ టేకింగ్ హైలైట్ అవుతాయి. అర్జున్, కాజల్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు'' అని చెప్పారు.
కోట శ్రీనివాసరావు, జయసుధ, సాయికుమార్, రాహుల్‌దేవ్, అజయ్, ఎల్.బి.శ్రీరాం, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, కళ: ఆనంద్ సాయి, సంగీతం: దేవిశ్రీప్రసాద్


Click it and Unblock the Notifications












