Bedurulanka Day1 Collections: మంచి ఓపెనింగ్స్ అందుకున్న బెదురులంక.. ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన యువ హీరో కార్తికేయ గుమ్మకొండ, డీజే టిల్లు సినిమాతో ఫేం సాధించిన నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం బెదురులంక 2012. నూతన దర్శకుడు క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బెన్నీ నిర్మించారు. టీజర్లు, సినిమా ట్రైలర్, పాటలకు, ప్రోమోలో డైలాగ్స్‌కు మంచి రెస్సాన్స్ రావడంతో ఈ సినిమాపై ఆసక్తి రేకిత్తించింది. యుగాంతం కాబోతుందనే కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పర్వాలేదనిపించినా... రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు హీరో కార్తికేయ గుమ్మకొండ. ఇక ఆ సినిమా తర్వాత పలు సినిమాలు చేసినా... ఆ రేంజ్ హిట్ మాత్రం కార్తికేయకు రాలేదు. కానీ ఆయన ప్రయత్నాలు మాత్రం ఆపకుండా సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నారు కార్తికేయ. ఇక కార్తికేయ తాజాగా నటించిన చిత్రం బెదురులంక 2012. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

2012లో యుగాంతం వస్తుందనే రూమర్ అయితే వచ్చింది. అయితే ఆ టైంలో ఓ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి... చావు భయం వారిని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టింది అనే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అయిన మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఇక ఈ మూవీ మొదటి రోజు డిసెంట్ కలెక్షన్స్ రాబట్టింది.
కార్తికేయ నటించిన బెదురులంక మొదటి రోజు ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 1.70 లక్షల రేంజ్ లో గ్రాస్ సాధించినట్లు చిత్ర బృందం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
బెదురులంక సినిమా మొదటిరోజు రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూస్తే.. నైజాం రూ.42 లక్షలు, సెడెడ్ రూ.23 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.20 లక్షలు, తూర్పు రూ.12 లక్షళు, పశ్చిమ రూ.7 లక్షలు, గుంటూరు రూ. 14లక్షలు, కృష్ణ రూ. 12 లక్షలు, నెల్లూరు రూ.6 లక్షలు వసూలు చేయగా... తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా మొదటి రోజు రూ.1.36 కోట్ల గ్రాస్ రాబట్టగా... రూ.80 షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని రూ.27లక్షలు సాధించగా... మొత్తం వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.1.76కోట్ల గ్రాస్ రాబట్టగా... 0.94 లక్షల షేర్ రాబట్టింది.

ఇక బెదురు లంక సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 4.10 కోట్ల రేంజులో ఉండగా సినిమా 4.50 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక ఈ సినిమా క్లీన్ హిట్ టాక్ రావాలంటే... దాదాపు 3.56 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications











