Bedurulanka Day2 Collections: కార్తికేయ హిట్ కొట్టాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలో తెలుసా?
యువ హీరో కార్తికేయ గుమ్మకొండ, డీజే టిల్లు ఫేం నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం బెదురులంక 2012. నూతన దర్శకుడు క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బెన్నీ నిర్మించారు. యుగాంతం కాబోతుందనే కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పర్వాలేదనిపించినా... రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
కార్తికేయ నటించిన బెదురులంక 2012 మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇక ఇదే ఊపు కొనసాగిస్తే.. కార్తికేయ కెరియర్ లో మంచి హిట్ గా నిలవనుంది ఈ సినిమా. విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక మొదటి రోజు దాదాపు వరల్డ్ వైడ్ గా 1.76 కోట్ల రూపాయలను వసూలు చేయగా.. రెండో రోజూ కూడా డిసెంట్ కలెక్షన్స్ రాబట్టింది.

బెదురులంక 2012 సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.80లక్షల నుంచి రూ.90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుందని అనుకుంటే... ఆ మార్క్ ని దాటేసి సినిమా 93 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా... మొదటి రోజు రూ.1.76 కోట్లు రాబట్టగా... రెండో రోజు... 1.90 కోట్లు వసూలు చేసి... రెండు రోజుల్లో రూ.3.83 కోట్లను వసూలు చేసిందని చిత్రబృందం ప్రకటించింది.

బెదురులంక సినిమా మొదటిరోజు రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూస్తే.. నైజాం రూ.95 లక్షలు, సెడెడ్ రూ.48 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.39 లక్షలు, తూర్పు రూ.27 లక్షలు, పశ్చిమ రూ.14 లక్షలు, గుంటూరు రూ. 27 లక్షలు, కృష్ణ రూ. 23 లక్షలు, నెల్లూరు రూ.13 లక్షలు వసూలు చేయగా... తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రెండో రోజు రూ.2.86 కోట్ల గ్రాస్ రాబట్టగా... రూ.1.73షేర్ వసూలు చేసింది.

ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని రూ. 67లక్షలు సాధించగా... మొత్తం వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.3.83 కోట్ల గ్రాస్ రాబట్టగా... రూ. 2.07 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 4.50 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొత్తం మీద 2 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.43 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











