Dhurandhar 2 Vs Youth: ధురంధర్ 2 తుఫాన్‌ని ఎదిరించి 50 కోట్ల వసూళ్లు.. యూత్ కలెక్షన్స్ సంచలనం

ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన మూవీ ధురంధర్ 2. ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రం. బాహుబలి 2, పుష్ప 2 వంటి భారీ చిత్రాల రికార్డులను సైతం ధురంధర్ 2 ఇప్పటికే బద్ధలు కొట్టింది. త్వరలోనే 2000 కోట్ల మార్క్‌ను సైతం అవలీలగా అధిగమిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ధురంధర్ 2 ధాటికి స్టార్ హీరోల సినిమాలు కూడా నిలవలేకపోగా.. కొన్ని చిత్రాలు రిలీజ్‌లను వాయిదా వేసుకున్నాయి. అలాంటిది ఓ చిన్న సినిమా.. ధురంధర్ 2 ప్రభంజనంలోనూ సంచలన వసూళ్లతోట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..

యూత్ తారాగణం
కెన్ కరుణాస్, అనిష్మా అనిల్ కుమార్, దేవదర్శని, సూరజ్ వెంజరామూడు, ప్రియాంషీ యాదవ్, మీనాక్షి దినేష్, అభిసాన్ దేవరస తదితరులు నటించిన మూవీ యూత్. ఈ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వం బాధ్యతలను కెన్ అండ్ గ్యాంగ్ అందించారు. ఈ సినిమాను కరుప్పయ్య సీ రామ్, సులోచన కుమార్ సంయుక్తంగా నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. నాష్ ఎడిటర్‌గా, రాము థంగరాజ్ ఆర్ట్ డైరెక్టర్‌గా, వికీ సినిమాటోగ్రాఫర్‌గా, కావ్య శ్రీరామ్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, రామ్ థంగరాజ్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా మార్చి 20వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 12 రోజుల వరకు ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Youth Movie into 50 crores club beating dhurandhar 2 wave in Tamilnadu and overseas

యూత్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణులు పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి యూత్ సినిమాకు 7 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్లు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై హైప్ నెలకొంది. యూత్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 7 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ట్రేడ్ పండితులు వెల్లడించారు.

యూత్ కలెక్షన్స్
ధురంధర్ 2 రిలీజైన తర్వాతి రోజు విడుదలైన ఈ సినిమాకు తొలిరోజున 3.65 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.60 కోట్ల రూపాయలు, మూడో రోజున 5.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 5.45 కోట్ల రూపాయలు, ఐదో రోజున 2.45 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.19 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2.10 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 1.90 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 2.21 కోట్ల రూపాయలు, పదో రోజున 3.63 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 4 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 1.23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో 37.51 కోట్ల రూపాయల నెట్.. 43 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

యూత్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్‌లోనూ యూత్ సినిమా కలెక్షన్ల పంట పండిస్తోంది. ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ చిత్రాలు ఉన్నప్పటికీ ఈ చిన్న చిత్రం సత్తా చాటుతోంది. ఆదివారం వరకు ఒక్క నార్త్ అమెరికాలోనే 34k డాలర్లు (32 లక్షల రూపాయలు) వసూలు చేసింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో కలిపి ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో యూత్ చిత్రానికి 1.08 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 10.23 కోట్ల రూపాయలు) రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి యూత్ మూవీకి ఇప్పటి వరకు 54 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది.

12 రోజుల్లో 50 కోట్ల కలెక్షన్స్
12 రోజుల వరకు తమిళనాడులో 38.87 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3.20 కోట్ల రూపాయలు, కేరళలో 1.04 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 45 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు చొప్పున ఈ సినిమా వసూలు చేసింది. ఒక్క తమిళనాడులోనే ఇప్పటి వరకు 18 కోట్ల రూపాయల షేర్ రాబట్టగా.. వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల రూపాయల షేర్ అందుకుంది. ఇప్పటి వరకు పెట్టుబడి మీద ఏకంగా 341.14 శాతం లాభాలను అందించింది యూత్ మూవీ. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో యూత్ మూడో స్థానంలో నిలిచింది. పరాశక్తి (83.23 కోట్ల రూపాయలు), తాయ్ కెలవి (81.27 కోట్ల రూపాయలు) ముందున్నాయి. థియేట్రికల్ రన్ ముగిసేసరికి యూత్ మూవీ ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X