Youth Movie Box Office: బ్లాక్‌బస్టర్ కలెక్షన్లతో యూత్.. 130 శాతం రికవరీ.. ఎన్ని కోట్ల లాభమంటే?

తమిళంలో బలమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ యూత్. ఈ చిత్రంలో కెన్ కరుణాస్, అనిష్మా అనిల్ కుమార్, దేవదర్శని, సూరజ్ వెంజరామూడు, ప్రియాంషీ యాదవ్, మీనాక్షి దినేష్, అభిసాన్ దేవరస తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వం బాధ్యతలను కెన్ అండ్ గ్యాంగ్ అందించడమే కాకుండా నటించారు. ఈ సినిమాను కరుప్పయ్య సీ రామ్, సులోచన కుమార్ నిర్మించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. నాష్ ఎడిటర్‌గా, రాము థంగరాజ్ ఆర్ట్ డైరెక్టర్‌గా, వికీ సినిమాటోగ్రాఫర్‌గా, కావ్య శ్రీరామ్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, రామ్ థంగరాజ్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా మార్చి 20వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రిలీజ్ తర్వాత వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Youth day 4 Box office Collections

యూత్ సినిమా కథ విషయానికి వస్తే.. 15 ఏళ్ల యువకుడు ప్రవీణ్ (కెన్ కరుణాస్) తన స్కూల్ లైఫ్ ముగిసే సమయానికి నిజాయితీతో కూడిన ప్రేమను పొందాలని కలలు కంటాడు. అయితే ఆ ప్రేమను పొందే క్రమంలో కొన్ని రిలేషన్‌షిప్స్ బ్రేకప్స్‌కు దారి తీస్తాయి. తన జీవితంలో ఎదురైన సంఘటనలు ఏమిటి? ఇంతకు ట్రూ లవ్‌ను పొందడంలో ప్రవీణ్ సక్సెస్ అయ్యాడా? అనేది ఈ సినిమా కథ.

కంటెంట్, కథ, కథనాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కొత్త వారితో ఈ సినిమాను వినోదాత్మక చిత్రంగా నిర్మించారు. ఈ చిత్రానికి పనిచేసిన వారి రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 7 కోట్ల రూపాయల మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సుమారుగా 7 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

యూత్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. తమిళనాడు వెర్షన్ 13 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తమిళనాడులో తొలి రోజు 4 కోట్లు, రెండో రోజు 3.5 కోట్లు, మూడో రోజు 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కర్ణాటకలో 1.25 కోట్ల రూపాయలు, కేరళలో 25 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల రూపాయలు, మిగితా ప్రాంతాల్లో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 15 కో ట్ల రూపాయలు ఇండియాలో రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో గత మూడు రోజుల్లో ఈ సినిమా 4 కోట్ల మేర వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 19 కోట్ల రూపాయలను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది.

యూత్ సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే తమిళంలో భారీ లాభాలను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మేర షేర్ వసూలు చేసింది. ఈ సినిమా నాలుగో రోజు కూడా 4 కోట్లకుపైగా వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. డ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 130 శాతం రికవరీని సాధించింది అని వెల్లడించారు. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో సుమారుగా 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్న బడ్జెట్ చిత్రాల్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకొనేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమా మార్చి 26వ తేదీన తెలుగులో రిలీజ్ కాబోతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X