twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైఎస్ఆర్ బయోపిక్ కలెక్షన్లు: యాత్ర 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

    |

    Recommended Video

    Yatra Movie 3 Days Box Office Collections | Filmibeat Telugu

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన యాత్ర చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సానుకూలమైన స్పందన లభిస్తున్నది. ఆనందోబ్రహ్మ ఫేం మహీ వీ రాఘవ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి పోషించారు. దివంగత వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర నేపథ్యంగా రూపొందిన యాత్ర చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన రిలీజై మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

     ఆంధ్రా, సీడెడ్‌లో యాత్ర వసూళ్లు

    ఆంధ్రా, సీడెడ్‌లో యాత్ర వసూళ్లు

    తెలుగు రాష్ట్రాల్లో యాత్ర చిత్రం మోస్తారు వసూళ్లను సాధిస్తున్నది. ప్రధానంగా ఏపీలో గత మూడు రోజుల్లో ఈ చిత్రం గుంటూరులో రూ.82.30 లక్షలు,, నెల్లూరులో రూ.40.78 లక్షలు, కృష్ణాలో రూ.40.78 లక్షలు, వసూళ్లను సాధించింది. సీడెడ్‌లో మూడో రోజు 28.50 లక్షలు, సాధించగా, మొత్తంగా రూ.96 లక్షలు వసూలు చేసింది.

     నైజాంలో వైఎస్ఆర్ బయోపిక్

    నైజాంలో వైఎస్ఆర్ బయోపిక్

    నైజాంలో యాత్ర చిత్రం సుమారు రూ.1 కోటి వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. కేరళలో రూ.40 లక్షలు, మిగితా రాష్ట్రాల్లో రూ.40 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తున్నది.

    యూఎస్‌లో కలెక్షన్లు

    యూఎస్‌లో కలెక్షన్లు

    ఓవర్సీస్‌లో అంచనాలకు భిన్నంగా యాత్ర చిత్రం కలెక్షన్లను సాధిస్తున్నది. అమెరికాలో ఆదివారం కేవలం రూ.11.38 లక్షలు మాత్రమే సాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు మూడు రోజుల్లో రూ.1.28 కోట్లు (16k డాలర్లు) మాత్రమే వసూలు చేసింది.

    <strong>‘యాత్ర'లో ఆ సీన్లు చూసినపుడు సిగ్గేసింది: రావు రమేష్</strong>‘యాత్ర'లో ఆ సీన్లు చూసినపుడు సిగ్గేసింది: రావు రమేష్

    యూఏఈలో కలెక్షన్లు

    యూఏఈలో కలెక్షన్లు

    ఇక యూఏఈలో కూడా యాత్ర ఓ మోస్తారు వసూళ్లను సాధించింది. ఈ చిత్రం గత రెండు రోజుల్లో రూ.28 లక్షలు రాబట్టింది. ప్రవాస తెలుగు ప్రజలు వైఎస్ఆర్ బయోపిక్‌పై ఆదరణ కనబరుస్తున్నారు. వారాంతం తర్వాత పెద్దగా ప్రేక్షకుల ఆదరణ ఉండకపోవచ్చనే మాట వినిపిస్తున్నది.

    మూడు రోజుల్లో 6 కోట్ల గ్రాస్

    మూడు రోజుల్లో 6 కోట్ల గ్రాస్

    ప్రపంచవ్యాప్తంగా యాత్ర సినిమా కలెక్షన్లను పరిశీలిస్తే మొత్తంగా రూ.6 కోట్ల గ్రాస్, రూ.3 కోట్లకుపైగా నికర కలెక్షన్లు రాబట్టినట్టు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.10 కోట్లుగా అంచనా వేశారు. ఈ చిత్రం రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లను రాబట్టగలిగితే తప్ప పెద్దగా బ్రేక్ ఇవెన్‌లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

    English summary
    Mammootty-starrer Yatra, which released on February 8, is setting the box office on fire. Directed by Mahi V Raghav, the film is about late politician YS Rajasekhar Reddy's iconic padayatra. This movie collecting slow phase manner collections world wide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X