Yuva 5 days Collections షాకింగ్‌గా యువ కలెక్షన్లు.. పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ హీరో మూవీ లాభాల్లోకి రావాలంటే?
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ ఫ్యామిలీ నుంచి సినీ వారసుడిగా అడుగు పెట్టిన యువ రాజ్‌కుమార్ మూవీకి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు నటించిన ఈ సినిమాకు ఆరంభంలో మంచి కలెక్షన్లు నమోదు అయ్యాయి. అయితే తొలివారాంతం తర్వాత ఈ సినిమా కలెక్షన్లు భారీగా పడిపోయాయి. అయితే బాక్సాఫీస్ కలెక్షన్లు తగ్గడానికి కారణాలు ఏమిటనే విషయంలోకి వెళితే..
కాలేజ్ పాలిటిక్స్, లవ్, రొమాన్స్, యాక్షన్ అంశాలను జోడించి రూపొందించిన యువ చిత్రానికి భారీగా ఖర్చు చేశారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

విడుదలకు ముందు యువ చిత్రానికి భారీ క్రేజ్ కనిపించింది. దాంతో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2 వేల స్క్రీన్లలో విడుదల చేశారు. ఓ యంగ్ హీరో సినిమాను ఈ రేంజ్‌లో విడుదల చేయడం కన్నడ పరిశ్రమలో ఇదే తొలిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
యువ చిత్రాన్ని కన్నడలోనే భారీగా రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో కూడా అత్యధికంగా స్క్రీన్లలో విడుదల చేశారు. ఈ సినిమాకు తొలివారాంతం సుమారుగా 50 నుంచి 60 శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపించింది. బెంగళూరుతోపాటు హుబ్లీ, దక్షిణ కర్ణాటకలో మంచి ఆదరణ లభించింది. దాంతో ఓవరాల్‌గా 55 శాతం ఆక్యుపెన్సీ నమోదు అవుతున్నది.

ఇక యువ చిత్రం కన్నడలో రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా తొలి రోజు 2 కోట్లకుపైగా నికరంగా, 4 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు కూడా నిలకడగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా రెండో రోజు 1.7 కోట్లు నికరంగా, 3.5 కోట్ల గ్రాస్, మూడో రోజు అత్యధికంగా 2.5 కోట్ల నికరంగా 5 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో తొలివారాంతంలో 12.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఇక తొలివారాంతం తర్వాత ఈ సినిమా కలెక్షన్లు మందగించాయి. 4వ వరోజు ఈ సినిమా 85 లక్షలు నికరంగా, 1.5 కోట్లు గ్రాస్, మంగళవారం 50 లక్షల గ్రాస్ 1 కోటి రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు అంటే 5 రోజుల్లో 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ఇక యువ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం భారీగానే ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఇప్పటికి 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











