Yuva Movie Collections పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు

కన్నడ సినీ పరిశ్రమలో లెజెండరీ ఫ్యామిలీ రాజ్‌కుమార్ కుటుంబం నుంచి మరో వారసుడు వచ్చేశాడు. ఇప్పటికే శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ సూపర్ స్టార్స్‌గా ఆ కుటుంబం నుంచి ఎదిగిన సంగతి తెలిసిందే. స్వర్గీయ రాజ్‌కుమార్ కొడుకు నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ వారసుడిగా యువ రాజ్‌కుమార్ కన్నడ పరిశ్రమలోకి యువ అనే చిత్రం ద్వారా అడుగుపెట్టారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ బజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా రిలీజ్ తర్వాత వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

కన్నడలో విడుదలకు ముందే సంచలన రేపిన యువ చిత్రం ట్రైలర్ సినిమాపై ఊహించని క్రేజ్ పెంచింది. స్టూడెంట్ పాలిటిక్స్, గ్రూప్ వార్, ఫాదర్ సెంటిమెంట్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో కాంతార ఫేమ్ సప్తమీ గౌడ హీరోయిన్‌గా నటించింది. ఇక ప్రమోషన్సల్ కార్యక్రమాలు ఊపందుకోవడంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది.

Yuva Movie Day Wise Box Office Collections Worldwide Yuva Rajkumar s Movie good Start at GBOC

యువ చిత్రం రిలీజ్ తర్వాత విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్నది. యువ రాజ్‌కుమార్ యాక్టింగ్, యాక్షన్, ఫెర్పారెన్స్‌కు అన్ని వర్గాల ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. ఈ సినిమా భారీ విజయం వైపు దూసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం మంచి ఆక్యుపెన్సీనిని నమోదు చేసింది.

కాలేజ్, యూత్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన యువ చిత్రాన్ని రిచ్‌గా తెరకెక్కించారు. ఖర్చు కోసం రాజీ పడకుండా సినిమాను భారీగా నిర్మించారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Yuva Movie Day Wise Box Office Collections Worldwide Yuva Rajkumar s Movie good Start at GBOC

యువ సినిమా టీజర్ రిలీజ్ నుంచి విడుదల వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సౌత్ ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ పెంచింది. దాంతో ఈ సినిమాను దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోను, అలాగే ఇండియాలోని ప్రధాన నగరాల్లో, ఓవర్సీస్‌లో భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. బెంగళూరు, బెల్గామ్, మైసూర్, శివమొగ, తూమ్కూర్, రాయ్‌,చూర్ తదితర ప్రాంతాల్లో 70 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇక యువ రాజ్‌కుమార్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో ఈ చిత్రం భారీ ఓపెన్సింగ్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం ఫస్ట్ డే 4 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X