Yuvarathna, Sulthan collections: పోరాడుతున్న కార్తీ, పవర్ స్టార్.. ఇలా అయితే నష్టాలు తప్పవు
కంటెంట్ బావుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలను హిట్ చేయడంలో తెలుగు ఆడియెన్స్ ముందుంటారు. ఇక వేరే ఇండస్ట్రీలోని హీరోలు కనెక్ట్ అయితే అంత ఈజీగా వాదిలిపెట్టరు. ఇక ఆ విధంగా ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయిన వారిలో కార్తీ ఒకరు. కార్తీ నటించిన సుల్తాన్ సినిమా రీసెంట్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఇక కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మొదటిసారి తన సినిమాను తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ చేశాడు. ఇక ఫస్ట్ వెకెండ్ సినిమాలు అందుకున్న కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

సుల్తాన్ టార్గెట్..
కార్తీ ఎలాంటి సినిమా చేసినా కూడా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రావాల్సిందే. ఒక విదంగా తన అన్న సూర్య కంటే కూడా కార్తీ తెలుగులో మినిమమ్ హిట్ అందుకుంటూ వస్తున్నాడు. పెట్టిన పెట్టుబడికి బయ్యర్లకు మంచి లాభాలను అందిస్తున్నాడు. ఇక సుల్తాన్ సినిమా తెలుగులో 6.5కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది.
వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్ (ఫొటోలు)

హిట్టవ్వాలి అంటే..
ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో మొత్తంగా 2.60కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే మరో 3.9కోట్ల వరకు షేర్ ను సాధించాలి. వీకెండ్స్ కాబట్టి సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కానీ వీకెండ్స్ అనంతరం కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయా లేదా అనేది అనుమానంగా మారింది.
వైల్డ్ డాగ్ సినిమా చూసి రోమాలు నిక్కబొడుచుకొన్నాయి.. నాగ్‌పై చిరంజీవి ప్రశంసలు (ఫొటోలు)

యువరత్నతో వచ్చిన పవర్ స్టార్
గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం యువరత్న. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన యువరత్న సినిమా కన్నడ లో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎడ్యుకేషన్ కు సంబంధించిన కథతో వచ్చిన సినిమా కాబట్టి తప్పకుండా అందరూ చూస్తారని తెలుగులో రిలీజ్ చేసి ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు.
ఎర్ర చీర మూవీ సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

మరో 40 లక్షలు వస్తే..
ఇక ఈ సినిమాను తెలుగులో 60లక్షలకు అమ్మగా 80లక్షల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. అయితే ఈ మూవీ 4రోజుల్లో 41లక్షల షేర్ ను అందుకుంది. సినిమాకు కొంత పాజిటివ్ టాక్ రావడం వలన మొదటి మూడు రోజుల్లో కంటే కూడా ఆదివారం కలెక్షన్స్ కొంచెం ఎక్కువగా వచ్చాయి. సినిమా హిట్టవ్వాలి అంటే మరో 40లక్షల షేర్ ను అందుకోవాలి. మరి సినిమా ఈ వారం ఏ రేంజ్ లో లాభాలను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











