ధరమ్ తేజ్ కెరీర్ లో మొట్టమొదటి సారి...రిపబ్లిక్ సినిమాకి రికార్డ్ బ్రేకింగ్ ఆఫర్!
కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. దాదాపుగా రెండోదశ దెబ్బకు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ లోకి వెళ్లి పోయాయి. ఇప్పుడిప్పుడే కాస్త నెమ్మదిగా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్ అయి మళ్లీ పునర్ వైభవం రావాలంటే కనీసం మూడు నాలుగు నెలలైనా పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక దసాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

తెలుగు రాష్ట్రాల్లో డౌటే
మే 5వ తారీఖున మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం మొత్తం ఐదు లెవెల్స్ లో కరోనా కేసులను బట్టి ప్రాంతాలను విభజించారు. లెవెల్ వన్ కి పూర్తిస్థాయిలో థియేటర్ లను ఓపెన్ చేసుకునే అవకాశం ఇస్తే మిగతా లెవల్స్ లో రేషియో వాటిని తగ్గిస్తూ వెళ్లారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇప్పట్లో ఏమీ చెప్పలేని విధంగా ఉంది

డిజిటల్ రిలీజ్ కోసం
అందుకే దాదాపు సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్కు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ డిజిటల్ రిలీజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ సినిమా కూడా డిజిటల్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓకే సారి దీనిని పేపర్ వ్యూ పద్ధతిలోనే కాకుండా థియేటర్స్ లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.

జీ5 సంస్థ భారీ అమౌంట్
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని దక్కించుకోవడానికి జీ5 సంస్థ భారీ అమౌంట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాకు గాను దాదాపు 40 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ హక్కులు, శాటిలైట్ హక్కులు, డబ్బింగ్ హక్కులతో పాటు థియేట్రికల్ హక్కులు కూడా ఉన్నాయి.

నిర్మాతలు హ్యాపీ
అయితే సినిమా బడ్జెట్ తో పోల్చుకుంటే ఈ అమౌంట్ చాలా ఎక్కువేనని అందుకే నిర్మాతలు కూడా ఆ అమౌంట్ కి ఒప్పుకున్నారు అని అంటున్నారు. గతంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటరూ సినిమాకి 32 కోట్లు వెచ్చించి ఇదే సంస్థ దక్కించుకుంది. ఆ సినిమా పర్ఫామెన్స్ బాగుండడంతో ఈ సినిమాని కూడా భారీ రేటు వెచ్చించడానికి ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.
Recommended Video

భారీ అంచనాలు
సాయి ధరంతేజ్ దేవాకట్టా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా పూర్తిగా కొల్లేరు నేపథ్యంలో తెరకెక్కింది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. సాయి ధరంతేజ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లుగా గతంలో సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ లో చూపించడంతో సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది.


Click it and Unblock the Notifications











