twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజంగానే ‘జీరో’ అయ్యేలా ఉంది... షాకిస్తున్న కలెక్షన్స్!

    |

    'జీరో' చిత్రం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌ను బాక్సాఫీసు రేసులో నిజంగానే జీరోను చేసేలా ఉంది. ఈ చిత్రం పరిస్థితి బాక్సాఫీసు వద్ద దారుణంగా ఉండటమే ఇందుకు కారణం. ఆదివారంతో ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ. 59.07 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తొలి రోజు రూ. 20.14 కోట్లు వసూలవ్వగా శని, ఆదివారాల్లో గ్రోత్ కనిపించలేదు.

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... శుక్రవారం రూ. 20.14 కోట్లు, శనివారం రూ. 18.22 కోట్లు, ఆదివారం రూ. 20.71 కోట్లు రాబట్టింది. కిస్మస్ హాలిడే సీజన్ కావడంతో వసూళ్లు అదిరిపోతాయని వేసిన అంచనాలు తలంక్రిందులయ్యాయి. దీనికి తోడు వచ్చే వారం రణవీర్ సింగ్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన 'సింబా' విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో 'జోరో'కు గడ్డుకాలం తప్పదని అంటున్నారు.

    అంచనాలు అందుకోలేదు

    అంచనాలు అందుకోలేదు

    రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘జీరో' చిత్రంపై భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగిన విధంగానే దాదాపు 4500 స్క్రీన్లలో విడుదల చేశారు. తొలి రోజు ఇండియన్ బాక్సాఫీసు వద్ద కనీసం రూ. 30 కోట్లకు తగ్గకుండా ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేశారు. వీకెండ్, క్రిస్మస్ హాలిడే ఉండటంతో రూ. 100 నుంచి రూ. 150 కోట్లకు రీచ్ అవుతుందని అంచనా వేశారు. కానీ అలా జరుగలేదు.

    వెనకపడిపోయిన ‘జీరో'

    వెనకపడిపోయిన ‘జీరో'

    మరో వైపు ఇంటర్నేషనల్ బాక్సాఫీసు వద్ద కూడా ఈ చిత్రానికి పెద్దగా ఆదరణ లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో బాద్ షా సినిమాలకు మంచి మార్కెట్ ఉన్నప్పటికీ వసూళ్లు లేక పోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చాలా చోట్ల ఓపెనింగ్స్ పద్మావత్, రేస్ 3, సంజు, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ కంటే తక్కువగా నమోదయ్యాయి.

    అయ్యో! షారుక్ ఖాన్ ‘జీరో' బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే...అయ్యో! షారుక్ ఖాన్ ‘జీరో' బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే...

    ‘కెజిఎఫ్' ముందుకు ‘జీరో' వెనక్కి

    ‘కెజిఎఫ్' ముందుకు ‘జీరో' వెనక్కి

    అయితే ‘జీరో' చిత్రంతో పోటీ పడుతూ విడుదలైన కన్నడ డబ్బింగ్ చిత్రం ‘కెజిఎఫ్' రోజు రోజుకు వసూళ్లు పుంజకుంటుండగా..... ‘జీరో' చిత్రం రోజు రోజుకూ వసూళ్లు పడిపోతూ వెనకబడిపోతోంది.

    చివరకు ఫలితం ఎలా ఉంటుంది?

    చివరకు ఫలితం ఎలా ఉంటుంది?

    ‘జీరో' చిత్రం పరిస్థితి చూస్తుంటే.... సినిమా హిట్ స్థాయిని అందుకోవడం కష్టమే అనే అభిప్రాయాలు ట్రేడ్ విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. మరి చివరకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని నమెదు చేస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

    English summary
    Shah Rukh Khan, Anushka Sharma and Katrina Kaif starrer 'Zero' 3 days box office collections details out. The movie failed to lift up over the weekend with the ilm earning Rs 59.07 crore during the first weekend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X