అయ్యో! షారుక్ ఖాన్ ‘జీరో’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే...
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ భారీ విజయం అందుకుని చాలా కాలం అయింది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన 'జీరో' చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
తొలిరోజైన శుక్రవారం ఇండియా వ్యాప్తంగా 4380 స్క్రీన్లలో రిలీజైన ఈ చిత్రం కేవలం రూ. 20.14 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇది డీసెంట్ బిజినెస్ అయినప్పటికీ షారుక్ ఖాన్ స్టార్ ఇమేజ్ అందుకునే స్థాయి కాదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

భారీ హైప్ ఉన్నప్పటికీ..
‘జీరో' చిత్రానికి విడుదల ముందు నుంచే భారీ హైప్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరుగలేదు. దీనికి తోడు సినిమా విడుదలైన తొలి ఆటకే మిశ్రమ స్పందన రావడం, రివ్యూలు కూడా నెగెటివ్‌గా ఉండటంతో సినిమాపై ఎఫెక్ట్ పడింది.

తొలి రోజు వసూళ్లపై తరణ్ ఆదర్శ్ ట్వీట్
తొలి రోజు వసూళ్లపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్పందిస్తూ.... సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించడం లేదని... నాలుగువేలకు పైగా స్క్రీన్లలో విడుదలైనా చాలా తక్కువ బిజినెస్ చేసిందని ట్వీట్ చేశారు.

రెండో రోజు వసూళ్లు మరింత తగ్గాయి
‘జీరో' చిత్రానికి రెండో రోజు వసూళ్లు మరింత తగ్గాయి. ఫస్ట్ డే నెగెటివ్ టాక్, నెగెటివ్ రివ్యూల కారణంగా రూ. 18.22 కోట్లకు మించి బిజినెస్ కాలేదని అంటున్నారు. ఆదివారం వరకు రూ. 50 కోట్ల మార్కు అందుకేనే అవకాశం ఉంది.

రూ. 100 కోట్ల కష్టమే
సాధారణంగా షారుక్ ఖాన్ స్థాయి హీరో సినిమా ఫస్ట్ వీకెండ్ తొలి మూడు రోజుల్లో రూ. 100 కోట్ల కలెక్షన్ సాధిస్తుందనే అంచనాలు ఉంటాయి. అయితే ‘జీరో' పరిస్థితి చూస్తుంటే అందులో సగం రీచ్ అవ్వడం కూడా కష్టమే అంటున్నారు.


Click it and Unblock the Notifications











