Zombie Reddy 10 days Collections: ప్రశాంత్ వర్మకు హిట్టా? ఫట్టా?

భారీ అంచనాలతో రిలీజైన జాంబి Reddy చిత్రం డివైడ్ టాక్‌తో రెండో వారాంతాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది. సినీ విమర్శకులు పెదవి విరిచినప్పటికీ మాస్ ప్రేక్షకులు సినిమాను ఆదరించడంతో మోస్తారు కలెక్షన్లను నమోదు చేసింది. గత 10 రోజుల్లో జాంబి Reddy చిత్రం ఎంత సాధించిందంటే..

10వ రోజు కలెక్షన్లు

10వ రోజు కలెక్షన్లు

జాంబి Reddy చిత్రం 10వ రోజున నైజాంలో 6 లక్షలు, సీడెడ్‌లో రూ.3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.2 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.6 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.1 లక్షలు, గుంటూరులో రూ.1.4 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.1.8 లక్షలు, నెల్లూరులో రూ.1 లక్షలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 18 లక్షల రూపాయల నికర వసూళ్లను, 31 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

మొత్తం 10 రోజుల్లో వసూళ్లు

మొత్తం 10 రోజుల్లో వసూళ్లు

ఇక జాంబి Reddy చిత్రం మొత్తంగా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు చూసుకొంటే నైజాంలో ఈ చిత్రం రూ.1.86 కోట్లు, సీడెడ్‌లో రూ.1.09 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.65 లక్షలు, తూర్పు గోదావరిలో రూ.48 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.38 లక్షలు, గుంటూరులో రూ.51 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.50 లక్షలు, నెల్లూరులో రూ.33 కలెక్ట్ చేసింది.

10 రోజుల్లో 10 కోట్ల గ్రాస్

10 రోజుల్లో 10 కోట్ల గ్రాస్

జాంబి Reddy గత పది రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.5.80 కోట్ల నికర వసూళ్లు, 10 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.31 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.6.31 కోట్లు, 11 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

జాంబి Reddy రోజువారీ కలెక్షన్లు

జాంబి Reddy రోజువారీ కలెక్షన్లు

జాంబి Reddy చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సాధించిన రోజువారీ కలెక్షన్లను పరిశీలిస్తే.. మొదటి రోజు రూ.1.02 కోట్లు, 2వ రోజు 91 లక్షలు, మూడో రోజు రూ.1.60 కోట్లు, నాలుగో రోజు రూ.83 లక్షలు, ఐదో రోజు రూ.51 లక్షలు, ఆరో రోజు రూ.32 లక్షలు, ఏడో రోజు రూ.19 లక్షలు, ఎనిమిదో రోజు రూ.12 లక్షలు, 9వ రోజు 12 లక్షలు, 10వ రోజు 18 లక్షల రూపాయలు వసూలు చేసింది.

స్వల్ప లాభాల్లోకి జాంబి Reddy

స్వల్ప లాభాల్లోకి జాంబి Reddy

జాంబి Reddy చిత్రం విడుదలకు ముందు రూ.45 కోట్ల మేర బిజినెస్ చేసింది. అయితే 5 కోట్ల బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను జాంబి Reddy అధిగమించింది. దాంతో ఈ సినిమాకు రూ.1.31 కోట్ల లాభాన్ని ఇప్పటి వరకు నమోదు చేసింది. దర్శకుడు ప్రశాంత్ వర్మకు జాంబి రెడ్డి మంచి ఫలితాన్ని అందించిందని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X