Zombie Reddy ఫస్ట్ డే కలెక్షన్లు: లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలంటే!
జాంబీ జోనర్‌తో తెలుగు తెరను తాకిన జాంబిరెడ్డి చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన వ్యక్తమైంది. తెలుగు ప్రేక్షకులకు కొత్త జోనర్ పరిచయం చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ చిత్రంపై సినీ విమర్శకులు పెదవి విరిచేశారు. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి...

పాజిటివ్ టాక్‌తో రిలీజ్
జాంబి రెడ్డి చిత్రం రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. అ!, కల్కి చిత్రాలతో క్రేజ్ సంపాదించుకొన్న ప్రశాంత్ వర్మ మూడో చిత్రం జాంబి రెడ్డిపై పాజిటివ్ టాక్ క్రియేట్ అయింది. మెగా హీరోలు, ఇతర సినీ హీరోలు ఈ సినిమాకు అండగా నిలవడం, ట్రైలర్‌పై సానుకూలంగా మారింది.
అమృత ఖన్విల్కర్ గ్లామరస్ ఫోటోషూట్

భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్
ఇలాంటి పరిస్థితుల్లో జాంబిరెడ్డి చిత్రాన్ని గీతా డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమా బిజినెస్ రూ.4 కోట్ల నుంచి రూ.4.5 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. సినీ వర్గాల రిపోర్టు ప్రకారం.. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.5 కోట్లపైగానే వసూళ్లు రాబట్టాలనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి.

తొలి రోజు 3.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు
ఇలాంటి పరిస్థితుల్లో జాంబి రెడ్డి సినిమా తొలి రోజు కలెక్షన్లు కాస్త మెరుగ్గానే కనిపించాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.3.9 గ్రాస్ కలెక్షన్లను సాధించింది. అయితే కోవిడ్ పరిస్థితుల్లో ఈ చిత్రం సాధించిన వసూళ్లు పాజిటివ్‌గానే మొదలయ్యాయని చెప్పవచ్చు.

నైజాం, సీడెడ్, ఏపీలో
జాంబి రెడ్డి చిత్రం నైజాంలో రూ.32 లక్షలు వసూలు చేసింది. ఇక సీడెడ్‌లో ఈ చిత్రం రూ.19 లక్షలు రాబట్టింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.6 లక్షలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో 2 లక్షలు రాబట్టింది. ఇక ఏపీ వసూళ్ల విషయానికి వస్తే.. ఉత్తరాంధ్రలో జాంబి రెడ్డి చిత్రం 11 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 8 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.8 లక్షలు, గుంటూరులో 9 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ. 8.1 లక్షలు, నెల్లూరు రూ.6 లక్షలు కలెక్ట్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా
జాంబిరెడ్డి చిత్రం ఏపీ, తెలంగాణలో ఓవరాల్‌గా రూ.1.65 గ్రాస్, రూ.102 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. మొత్తంగా రూ. 3.55 కోట్ల గ్రాస్, రూ.2.12 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. తొలి రోజు కలెక్షన్ల తర్వాత ఇంకా ఈ చిత్రం సుమారు రూ.4 కోట్లు రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











