Zombie Reddy 3rd day collections: ఈ సినిమాకు వచ్చింది లాభాలా? నష్టాలా?

తెలుగు తెరపై తొలి జాంబీ జోనర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాంబి Reddy చిత్రం వారాంతంలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నప్పటికీ కలెక్షన్ల పరంగా మంచి ఫలితాన్ని రాబడుతున్నది. ఇక జాంబి Reddy మూడో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే...

Recommended Video

Zombie Reddy Review And Rating | A New Genre In Telugu
తొలి రోజు కలెక్షన్లు ఇలా..

తొలి రోజు కలెక్షన్లు ఇలా..

జాంబి Reddy చిత్రం తొలి రోజు ఏపీ, తెలంగాణలో రూ.0.91 లక్షల నెట్ కలెక్షన్లు, రూ.1.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.2.09 కోట్ల నికర వసూళ్లను, అలాగే రూ.3.6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో బ్రేక్ ఈవెన్ సాధించే దిశగా ఈ చిత్రం వసూళ్లను రాబట్టింది.

రెండో రోజు వసూళ్లు..

రెండో రోజు వసూళ్లు..

జాంబి Reddy చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడంతో రెండో రోజు మంచి వసూళ్లు నమోదయ్యాయి. ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో 1.65 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నికరంగా 1.02 కోట్లు రాబట్టింది. ఇక కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో 6 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.2 లక్షలు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగదా ఈ చిత్రం 1.10 కోటి నికరంగా, రూ.1.90 కోట్ల గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది.

మూడో రోజు ఎంత రాబట్టిందంటే...

మూడో రోజు ఎంత రాబట్టిందంటే...

ఇక మూడో రోజు విషయానికి వస్తే.. నైజాంలో ఈ చిత్రం రూ. 56 లక్షలు, సీడెడ్‌లో రూ.29 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.17 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ. 10 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.9 లక్షలు, గుంటూరులో రూ.16 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.14.4 లక్షలు, నెల్లూరులో రూ.9 లక్షల వసూలు చేసింది.

మొత్తం మూడు రోజుల కలెక్షన్లు

మొత్తం మూడు రోజుల కలెక్షన్లు

జాంబి Reddy చిత్రానికి సంబంధించి మూడు రోజుల వసూళ్లు ఇలా నమోదయ్యాయి. గత మూడు రోజుల్లో నైజాంలో రూ. 1.14 కోట్లు, సీడెడ్‌లో రూ.65 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.38 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 28 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 24 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ.33 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.31 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 3.53 కోట్ల నికర వసూళ్లు, 6 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.14 లక్షలు, ఓవర్సీస్‌లో 18 లక్షలు రాబట్టింది.

లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలంటే..

లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలంటే..

ఇక జాంబి Reddy చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారు రూ.4.5 కోట్ల మేర జరిగినట్టు సినీ వర్గాల టాక్. అయితే ఈ చిత్రం తొలిరోజున రూ. రూ.2.09 కోట్ల నికర వసూళ్లు, రెండో రోజున రూ. 1.10 కోట్లు, మూడో రోజున రూ.1.06 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా రూ. 4.25 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ. కోటి రూపాయల నికర వసూళ్లు సాధించాలనేది ట్రేడ్ వర్గాల రిపోర్టు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X