Don't Miss!
- News పులివెందులలో జగన్ మెజార్టీ ఎంత - షర్మిల మంత్రాంగం..!!
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
Zombie Reddy 5 days collections: హిట్టా? ఫట్టా? లాభాల్లోకి రావాలంటే ఎంత రాబట్టాలంటే!
జాంబి Reddy చిత్రం టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల పరంగా మంచి ఫలితాలను రాబడుతున్నది. వేరే చిత్రాల నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో గత ఐదు రోజులుగా ఈ చిత్రం కలెక్షన్లు సంతృప్తికరంగా ఉన్నాయి. 5వ రోజు ఈ చిత్రం ఎంత మొత్తం రాబట్టిందంటే...
పాజిటివ్, మాస్ ఆడియెన్స్ సపోర్టుతో
సానుకూలమైన పరిస్థితులతోపాటు మాస్ ఆడియెన్స్ సపోర్టు లభించడంతో జాంబిరెడ్డి చిత్రం తొలి వారాంతంలో వసూళ్ల ఊపు కనిపించింది. అయితే సినిమాకు లిట్మస్ టెస్ట్‌గా మారే సోమవారం తర్వాత కలెక్షన్లు అదే స్థాయిలో సాధించలేకపోయినట్టు కనిపించింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను సాధించడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి.
పార్వతీ నాయర్ క్లీవేజ్.. హాట్ ఫోట్‌షూట్ వైరల్
జాంబి Reddy 5వ రోజు కలెక్షన్లు
జాంబి Reddy చిత్రం 5వ రోజున ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో మోస్తారు వసూళ్లు రాబట్టింది. నైజాలంలో ఈ చిత్రం రూ.16 లక్షలు కలెక్ట్ చేయగా, సీడెడ్‌లో రూ.10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.4.3 లక్షలు, పశ్చిమ గోదావరిలో 3.3 లక్షలు, తూర్పు గోదావరిలో రూ.4.3 లక్షలు, గుంటూరు జిల్లాలో 4.2 లక్షలు, కృష్ణా జిల్లాలో 4 లక్షలు, నెల్లూరులో 3 లక్షల వసూళ్లను సాధించింది.
జాంబి Reddy 5వ రోజులు కలెక్షన్లు
జాంబి Reddy చిత్రం ఓవరాల్‌గా 5 రోజుల్లో వసూళ్లు ఇలా ఉన్నాయి. నైజాంలో ఈ చిత్రం రూ.1.50 కోట్లకుపైగా సాధించగా, సీడెడ్‌లో రూ.90 లక్షలకుపైగా, ఉత్తరాంధ్రలో 55 లక్షలు. పశ్చిమ గోదావరిలో 32లక్షలు, తూర్పు గోదావరిలో రూ.40 లక్షలు, గుంటూరు జిల్లాలో 42 లక్షలు, కృష్ణా జిల్లాలో 40 లక్షలు, నెల్లూరులో 30 లక్షల వరకు వసూళ్లను సాధించింది.
బ్రేక్ ఈవెన్‌లో జాంబి Reddy
ఇక ఏపీ, తెలంగాణలో 5 రోజుల్లో రూ.4.87 కోట్ల నికర వసూళ్లు, రూ.8.33 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.16 లక్షలు, ఓవర్సీస్లో రూ.24 లక్షల నమోదుతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.5.27 కోట్ల నికర వసూళ్లు, రూ.9.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో బ్రేక్ ఈవెన్ సాధించింది.
జాంబి Reddy ఫైనల్ కలెక్షన్లు
జాంబి Reddy చిత్రం తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.2.09 కోట్ల నికర వసూళ్లను, అలాగే రూ.3.6 కోట్ల గ్రాస్ వసూళ్లను, రెండో రోజున 1.10 కోటి నికరంగా, రూ.1.90 కోట్ల గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది. మూడో రోజు రూ.1.60కోట్లు నికరంగా, రూ.2.85 కోట్ల గ్రాస్, నాలుగో రోజు రూ. రూ.85 లక్షలు నికరంగా, 1.50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
నష్టాల్లో నుంచి బయటపడి..
ఫైనల్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్‌తో పోల్చిచూసుకొంటే జాంబి Reddy చిత్రం 5 కోట్ల రూపాయలను సాధించాల్సింది. అయితే 5 రోజుల కలెక్షన్ల ప్రకారం ఈ చిత్రం రూ.5.25 కోట్లు రాబట్టడంతో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక ఈ చిత్రం హిట్ టాక్ సాధించడానికి ఇంకా ప్రయత్నిస్తున్నది. అయితే హిట్ రేంజ్ వసూళ్లను జాంబి Reddy సాధిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.