జాంబి Reddy 6వ రోజుల కలెక్షన్లు.. క్షీణించిన వసూళ్లు.. హిట్ మార్కు దాటాలంటే!
జాంబి Reddy చిత్రం కలెక్షన్లు వారంతం తర్వాత అంతగా గొప్పగా లేకపోవడం కాస్త నిరాశ కలిగించే అంశంగా మారింది. సోమవారం కలెక్షన్లను బట్టి ఈ చిత్రం హిట్ వైపు దూసుకెళ్తున్నట్టు సినీ ట్రేడర్లకు భావించారు. ఆ తర్వాత వస్తున్న ప్రేక్షకుల స్పందన క్షీణించడంతో వసూళ్లు సన్నగిల్లాయి. ఇంతకు 6వ రోజున ఈ చిత్రం ఎంత లాభాలను సాధించిందంటే..

జాంబిరెడ్డి 6వ రోజు కలెక్షన్లు
జాంబి Reddy చిత్రం 6వ రోజు వసూళ్లు గత 5 రోజుల కలెక్షన్లను చూస్తే కాస్త తగ్గినట్టు కనిపించాయి. ఈ చిత్రం నైజాంలో రూ.10 లక్షలు, సీడెట్ 6 లక్షల రూపాయలు, ఉత్తరాంధ్రలో రూ.3.6 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.2.3 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షల రూపాయలు, గుంటూరులో రూ.3 లక్షలు, కృష్ణ జిల్లాలో 2.9 లక్షలు, నెల్లూరులో రూ.2 లక్షలు వసూలు చేసింది.

మొత్తం 6వ రోజుల వసూళ్లు
జాంబి Reddy చిత్రం మొత్తం 6 రోజులు కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో రూ.1.66 కోట్లు, సీడెడ్‌లో రూ.99 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.59 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.42 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.34 లక్షలు, గుంటూరులో రూ. 46 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.44 లక్షలు, నెల్లూరులో రూ.29 లక్షలు వసూలు చేసింది.

జాంబి Reddy వరల్డ్‌వైడ్ కలెక్షన్లు
ఇక ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 5.19 కోట్ల నికర వసూళ్లు, 9.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. కర్ణాటక, ఇతర జిల్లాలో రూ.17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 25 లక్షలు కలెక్ట్ చేసింది. దాంతో 6 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.5.61 కోట్లు, రూ.9.85 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించాయి.

హిట్‌పై కన్నేసిన జాంబి Reddy
ఇక జాంబి Reddy సినిమా బిజినెస్ విషయానికి రూ.4.5 కోట్ల మేర థియేట్రికల్ హక్కులు అమ్ముడు పోయాయి. 6 రోజుల తర్వాత ఈ చిత్రం రూ.61 లక్షల లాభాన్ని ఆర్జించింది. బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం హిట్ రికార్డుపై కన్నేసింది.


Click it and Unblock the Notifications











