అదరగొట్టేసిన జాంబిరెడ్డి.. రెండు వారాల్లో దుమ్ములేపేసింది!
విభిన్న చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబీ రెడ్డి బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. విడుదలై రెండు వారాల్లో మంచి వసూళ్లను రాబట్టేసింది. మొత్తానికి సినిమా మాత్రం గట్టేక్కినట్టు కనిపిస్తోంది. ప్రశాంత్ వర్మ చిత్రాలకు టాక్ బాగానే వస్తుంది. కానీ కలెక్షన్లలో మాత్రం ఆ ప్రభావం కనిపించదు. కమర్షియల్‌గా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో జాంబీ కాన్సెప్ట్‌కు కమర్షియల్ అంశాలను జోడించాడు.
జాంబీలను హాలీవుడ్ తెరపై ఇది వరకు ఎన్నోసార్లు చూసి ఉంటారు. తెలుగు తెరకు జాంబీలు కొత్త అనుభూతినిస్తాయన్న ఉద్దేశ్యంతో ప్రశాంత్ వర్మ వాటికి తెలుగు నేటివిటీని అద్దాడు. కానీ అవి అంతగా తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు. అయినా కూడా సినిమా కలెక్షన్లు మాత్రం పర్వాలేదనిపించాయి. తాజాగా రెండో పూర్తి చేసుకున్న జాంబీరెడ్డి కలెక్షన్లలో దూసుకుపోతోందని మేకర్స్ ప్రకటించారు.

రెండు వారాల్లో దాదాపు పదిహేను కోట్లు కొల్లగొట్టిందని ప్రకటించారు. అసలే ఇప్పుడు పోటీ మరీ ఎక్కువైంది. ఈ వారం రంగంలో నాలుగు చిత్రాలు దిగాయి. ఆల్రెడీ ఉప్పెన జోరుమీదుంది. ఇలా అన్ని వైపులా అడ్డంకులున్నా గానీ ఇప్పటికీ జాంబీరెడ్డి మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక ఈ వారం కూడా జాంబీ రెడ్డి థియేటర్లలో తన సత్తా చాటుతుందో లేదో చూడాలి. మొత్తానికి తేజ సజ్జాకు మంచి డెబ్యూనే పడింది.


Click it and Unblock the Notifications











