twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Zombie Reddy 4 day Collections: షాకిస్తోన్న ‘జాంబీ రెడ్డి’ కలెక్షన్లు

    |

    గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగులో ఎక్కువగా ప్రయోగత్మక చిత్రాలు రూపొందుతున్నాయి. ఎలాంటి సినిమా తీసినా కమర్షియల్ విలువల కంటే కంటెంట్‌నే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఇప్పటి ఆడియెన్స్. అందుకు అనుగుణంగానే సరికొత్త కథాంశాలతో ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. ఇలా ఇటీవలి కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'జాంబీ రెడ్డి'. తెలుగులోనే మొదటి జాంబీ చిత్రంగా వచ్చిన దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇక, మంచి టాక్‌తో ఈ సినిమా నాలుగు రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

    టాలెంటెడ్ డైరెక్టర్ మరో ప్రయోగం

    టాలెంటెడ్ డైరెక్టర్ మరో ప్రయోగం

    వినూత్న చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ 'అ!', 'కల్కి' తర్వాత తెరకెక్కించిన చిత్రమే 'జాంబీ రెడ్డి'. తేజ సజ్జా, దక్ష, ఆనంది ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను యాపిల్ ట్రీ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మించారు. తెలుగులోనే మొదటి జాంబీ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమాను కరోనా వైరస్ నేపథ్యంతో తెరకెక్కించారు. మార్క్ రాబిన్ సంగీతం అందించిన ఈ మూవీ ఫిబ్రవరి 5న విడుదలైంది.

    ఫస్ట్ రోజే మంచి టాక్.. హైలైట్లుగా

    ఫస్ట్ రోజే మంచి టాక్.. హైలైట్లుగా

    కమర్షియల్ పంథాలో ప్రయోగాత్మకంగా తీసిన చిత్రం 'జాంబీ రెడ్డి'. ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ప్రశాంత్ వర్మ టేకింగ్ గురించే అంతా మాట్లాడుకున్నారు. అంతేకాదు, హీరో తేజ హీరోయిన్లు దక్ష, ఆనంది కూడా అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. అలాగే, మార్క్ కే రాబిన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్‌ అయింది.

    మొదటి రోజే ఊహించని విధంగా

    మొదటి రోజే ఊహించని విధంగా

    'జాంబీ రెడ్డి' చిన్న సినిమాగానే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లు ఆశించిన రీతిలో అవకున్నా.. కలెక్షన్లు మాత్రం రాబట్టిందీ జాంబీ సినిమా. ఫలితంగా మొదటి రోజే ఈ చిత్రం రూ. 1.02 కోట్లు నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.

    రెండు, మూడు రోజుల్లో ఎంతంటే

    రెండు, మూడు రోజుల్లో ఎంతంటే

    మొదటి రోజు టాక్ పరంగా, కలెక్షన్ల పరంగా సత్తా చాటింది 'జాంబీ రెడ్డి'. దీంతో రెండో రోజు కూడా ఈ చిత్రాన్ని చూడ్డానికి ప్రేక్షకుల ఆసక్తి చూపించారు. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 91 లక్షల వసూళ్లను రాబట్టింది. ఇక, మూడో రోజైన ఆదివారం మరింత ఆదరణను అందుకుంది. దీంతో ఆరోజు ఏకంగా రూ. 1.60 కోట్లు రాబట్టింది. మొదటి మూడు రోజుల్లో ఇవే అత్యధిక కలెక్షన్లు.

    నాల్గో రోజు మొత్తం వసూళ్లు ఇవే

    నాల్గో రోజు మొత్తం వసూళ్లు ఇవే

    ఇక, నాలుగో రోజు కూడా 'జాంబీ రెడ్డి' కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. దీంతో సోమవారం నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4.60 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 4.20 లక్షలతో మొత్తంగా రూ. 83 లక్షలు వసూలు చేసింది.

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    టీజర్, ట్రైలర్‌తోనే ఆకట్టుకున్న 'జాంబీ రెడ్డి' రిలీజ్‌కు ముందే బజ్‌ను ఏర్పరచుకుంది. దీంతో ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 4.50 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక, నాలుగు రోజులకు కలిపి రూ. 4.36 కోట్లు వసూలు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్‌కు రూ. 14 లక్షలు దూరంలో నిలిచింది. ఇక, ఐదో రోజే ఆ మైలురాయిని అందుకే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    English summary
    Zombie Reddy is an upcoming Indian Telugu-language action horror film directed by Prasanth Varma starring Sajja Teja and Anandhi under Apple Trees Studios banner. It is the first Zombie film in Tollywood. It will be partially based on COVID-19 pandemic. The film is set in the Kurnool backdrop. The film is scheduled to release on 5 February 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X