‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: ఏడో రోజు షాక్.. ఇకపై కష్టమే.. మొత్తంగా సినిమా రిజల్ట్ ఇదే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా ప్రయోగాత్మక చిత్రాలు మంచి ఫలితాలను రాబడుతున్నాయి. ఈ ధైర్యంతోనే ఎంతో మంది దర్శకులు సరికొత్త కథలను సిద్ధం చేస్తుండగా.. హీరోలు, నిర్మాతలు వాటిని చేయడానికి ముందుకొస్తున్నారు. ఇలా.. ఈ మధ్య కాలంలో ఎన్నో ఎక్స్‌పిరిమెంటల్ మూవీలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన చిత్రం 'జాంబీ రెడ్డి'. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం వారం రోజులుగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో మొత్తం ఇది ఎంత వసూలు చేసింది? ఇంతకీ సినిమా హిట్టా? ఫట్టా? తెలుసుకుందాం పదండి!

అదే ఫార్ములాతో డైరెక్టర్.. హీరో పరిచయం

అదే ఫార్ములాతో డైరెక్టర్.. హీరో పరిచయం

'అ!', 'కల్కి' వంటి ప్రయోగాత్మక చిత్రాలతో వైవిధ్యాన్ని చూపించాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ క్రమంలోనే అతడు 'జాంబీ రెడ్డి' అనే సినిమా తీశాడు. తేజ సజ్జా, దక్ష, ఆనంది ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను యాపిల్ ట్రీ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మించారు. తెలుగులోనే మొట్టమొదటి జాంబీ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమాకు మార్క్ రాబిన్ సంగీతం అందించారు.

హిట్ టాక్‌తో దూకుడు.. మూవీలో హైలైట్లు

హిట్ టాక్‌తో దూకుడు.. మూవీలో హైలైట్లు


సరికొత్త కథకు కమర్షియల్ హంగులు జోడించి తీసిన చిత్రమే 'జాంబీ రెడ్డి'. ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రశాంత్ వర్మ టేకింగ్.. హీరో తేజ హీరోయిన్లు దక్ష, ఆనంది కూడా అద్భుతమైన యాక్టింగ్‌.. మార్క్ కే రాబిన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. అలాగే, కామెడీ కూడా పండింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్


'జాంబీ రెడ్డి' ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించాడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత వచ్చిన టీజర్, ట్రైలర్‌తో ఈ మూవీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఎంతో మంది పోటీ పడ్డారు. దాదాపు రూ. 4.50 కోట్లకు అన్ని ప్రాంతాల హక్కలు అమ్ముడు పోయాయి. దీంతో బ్రేక్ ఈవెన్‌ను రూ. 5 కోట్లుగా ఫిక్స్ చేసుకున్నారు.

ఆరు రోజులకు కలిపి ఎంత వసూలు చేసింది

ఆరు రోజులకు కలిపి ఎంత వసూలు చేసింది

మొదటి రోజు టాక్ పరంగా, కలెక్షన్ల పరంగా సత్తా చాటింది 'జాంబీ రెడ్డి'. దీంతో ఆరోజు రూ. 1.02 కోట్లు రాబట్టి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత రెండో రోజు రూ. 91 లక్షలు, మూడో రోజు ఏకంగా రూ. 1.60 కోట్లు వసూలు చేసింది. అయితే అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ నాలుగో రోజు రూ. 83 లక్షలు, ఐదో రోజు రూ. 51 లక్షలు, ఆరో రోజు రూ. 32 లక్షలు మాత్రమే రాబట్టింది.

ఏడో రోజు బాగా తగ్గిపోయాయి... మొత్తంగా

ఏడో రోజు బాగా తగ్గిపోయాయి... మొత్తంగా

రిలీజ్ డే నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చిన 'జాంబీ రెడ్డి' కలెక్షన్లు.. ఏడో రోజు దారుణంగా పడిపోయాయి. నిన్న నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1.20 లక్షలు, గుంటూరులో రూ. 1.80 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో మొత్తంగా రూ. 19 లక్షలు వసూలు చేసింది.

ఇకపై కష్టమే.. మొత్తంగా సినిమా రిజల్ట్ ఇదే

ఇకపై కష్టమే.. మొత్తంగా సినిమా రిజల్ట్ ఇదే

'జాంబీ రెడ్డి' మొత్తంగా మొదటి వారం రూ. 5.38 కోట్లు షేర్, రూ. 9.34 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్‌ను దాటేసి లాభాలను సైతం అందుకుంది. దీంతో ఇప్పటి వరకే ఈ సినిమా డీసెంట్‌ హిట్‌గానే నిలిచింది. అయితే, శుక్రవారం నుంచి 'ఉప్పెన'తో పాటు మరో సినిమా కూడా విడుదల అవుతోన్న నేపథ్యంలో 'జాంబీ రెడ్డి' థియేటర్లు మొత్తంగా తగ్గిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X