Zombie Reddy Closing Collections: వరల్డ్ వైడ్ ఎంత వసూలు చేసిందంటే!
అ! సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమైన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ మొదటి సినిమాతోనే ఓ వర్గం ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాడు. ఇక ఆ తరువాత రాజశేఖర్ తో చేసిన కల్కి సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు గాని దర్శకుడి టాలెంట్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక మూడవసారి జాంబీస్ జానర్ ను టచ్ చేశాడు. ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాంబీరెడ్డి బాక్సాఫీస్ వద్ద పని ముగించుకుంది. ఇక సినిమాకు వచ్చిన మొత్తం కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

రిలీజ్ కు ముందే లాభాలు
ఈ సినిమా రిలీజ్ కు ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా మంచి లాభాలను అందుకుంది. ఒక విధంగా పెట్టిన పెట్టుబడి అక్కడే వచ్చేసింది. జాంబీ రెడ్డి టీజర్ కు ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రీమేక్ రైట్స్, హిందీ డబ్, శాటిలైట్ రైట్స్ ద్వారా నిర్మాత సేఫ్ జోన్ లోకి వచ్చాడు. ప్రశాంత్ వర్మ గత సినిమాలు టెక్నీకల్ గా మంచి రెస్పాన్స్ అందుకోవడం ఈ సినిమా బిజినెస్ కు ప్లస్ అయ్యింది.

సినిమా టార్గెట్..
జాంబీ రెడ్డి సినిమా టార్గెట్ కూడా పెద్దది కాదు. నిర్మాతలు సొంతంగానే సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేశారు. 4.5కోట్ల బిజినెస్ టార్గెట్ సినిమా బాక్సాఫీస్ భరిలో దిగింది. ముఖ్యంగా చేసిన ప్రమోషన్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయనే చెప్పాలి. ఇక సినిమా మొదటి రోజే మిక్సీడ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ గట్టిగానే అందుకుంది.

మొదటి రోజు నుంచి..
మొదటి రోజే సినిమా వరల్డ్ వైడ్ గా 1.02కోట్ల షేర్స్ ను అందుకుంది. పోటీగా మరికొన్ని చిన్న సినిమాలు విడుదలైనప్పటికి పెద్దగా ప్రభావం పడలేదు. వీకెండ్ లో కూడా వసూళ్లను బాగానే అందుకుంది. ఇక సినిమా నిన్నటితో బిజినెస్ మొత్తం క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి లాభాలతో జాంబీ రెడ్డి సూపర్ హిట్ గా నిలిచింది.

క్లోజింగ్ కలెక్షన్స్
సినిమా 4.5కోట్ల బిజినెస్ తో విడుదలవ్వగా ఏపీ తెలంగాణలోనే 6.10కోట్ల షేర్స్ అందుకుంది. వరల్డ్ వైడ్ షేర్ 6.65కోట్లు. ఇక గ్రాస్ కలెక్షన్స్ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా సినిమా 12కోట్ల వసూళ్లను అందుకోవడం విశేషం. ఫైనల్ గా జాంబీ రెడ్డి నిర్మాతలకు పెట్టిన పెట్టుబడికి థియేట్రికల్ గా 1.65కోట్ల వరకు ప్రాఫిట్స్ అందించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











