‘గల్లీబాయ్’ ఫస్ట్ వీక్ రిపోర్ట్: దుమ్మురేపుతున్న కలెక్షన్స్!

Recommended Video

Gully Boy Has Rushing Towards Rs 100 Crore Mark | Filmibeat Telugu

రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా జోయా అక్తర్ దర్శకత్వంలో రూపొందిన 'గల్లీ బాయ్' బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. సినిమా విడుదలైన వారంలోనే కలెక్షన్లు రూ. 100 కోట్లకు చేరువయ్యాయి. రిలీజ్ ముందు సినిమాకు ఎంత హైప్ వచ్చిందో కలెక్షన్లు కూడా అదే స్థాయిలో రాబడుతోంది.

బాక్సాపీసు వద్ద బుధవారం ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రూ. 89.15 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసింది. సెకండ్ వీకెండ్ రూ. 100 కోట్ల మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో రెస్పాన్స్ అద్భుతంగా ఉంది.

ఓవర్సీస్ వసూళ్లు కేక..

ఓవర్సీస్ వసూళ్లు కేక..

ఫిబ్రవరి 19వ తేదీ వరకు అందిన వివరాల ప్రకారం ‘గల్లీ బాయ్' ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు 6 మిలియన్ డాలర్(రూ. 42.70 కోట్లు) వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. యూఎస్ఏ- కెనడాలో 3 మిలియన్, యూఏఇ-గల్ప్ దేశాల్లో 1.231 మిలియన్, యూకెలో 4.30 లక్షల డాలర్స్, ఆస్ట్రేలియాలో 5.42 లక్షల డాలర్స్ రాబట్టింది.

మురికివాడ కుర్రాడి కథ

మురికివాడ కుర్రాడి కథ

‘గల్లీ బాయ్'లో రణవీర్ సింగ్ మురద్ అనే ముంబై మురికివాడకు చెందిన కుర్రాడిగా నటించాడు. తన సోసియో-ఎకనమిక్ స్థాయిని దాటి ఒక స్టార్‌గా అతడు ఎలా ఎదిగాడు అనేది తెరపై దర్శకురాలు అద్భుతంగా ఆవిష్కరించారు. స్ట్రీట్ రాపర్స్ డివిన్, నాజీ లైఫ్ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు.

రణవీర్ కెరీర్లో ది బెస్ట్ మూవీ

రణవీర్ కెరీర్లో ది బెస్ట్ మూవీ

రణవీర్ సింగ్ ఇప్పటి వరకు తాను చేసిన సినిమాల్లో ది బెస్ట్ చిత్రంగా దీనికి ప్రశంసలు దక్కించుకున్నాడు. నటన పరంగా కూడా అతడు మరింత పరిణితి చూపించారనే అభిప్రాయాలు ప్రేక్షకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. సినిమా టాక్ బావుండటంతో రోజు రోజుకు వసూళ్లు పుంచుకుంటున్నాయి.

గల్లీ బాయ్

గల్లీ బాయ్

టైగర్ బేబీ నిర్మించిన ‘గల్లీ బాయ్' చిత్రాన్ని ఎక్సెల్‌ఎంటర్టెన్మెంట్స్ సంస్థ నిర్మించింది. రణవీర్, అలియాతో పాటు కల్కి కొచ్లిన్, సిద్ధాంత్ చతుర్వేది, విజయ్ రాజ్, అమృత సుభాష్ ముఖ్య పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X