twitter
    CelebsbredcrumbA R RahmanbredcrumbBiography

    ఎ ఆర్ రెహమాన్ బయోగ్రఫీ

    రెహమాన్ భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు, మరియు దాత. రెహమాన్ జన్మనామం ఎ. ఎస్. దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం తీసుకున్నడు. రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణించడంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది.

    రెహమాన్ గీతాలు తూర్పుదేశాలకు చెందిన శాస్త్రీయ సంగీతాన్ని, ప్రపంచ సంగీతం, ఎలక్ట్రానిక్ సంగీతం, సంప్రదాయ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్ల వలన పేరొందాయి. ఆయన పొందిన పురస్కారాల్లో రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 19 ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు ఉన్నాయి.

    ఎ. ఆర్. రెహమాన్ తల్లి కరీమా బేగమ్ అనారోగ్యంతో చెన్నయ్ లో కన్నుమూశారు. ప్రముఖ సంగీత కళాకారుడు శేఖర్ కుమారుడైన దిలీప్... రెహమాన్ గా మారడానికి అతని తల్లి కమల కారణం. అనారోగ్యంతో శేఖర్ కన్నుమూసిన తర్వాత దిలీప్ మ్యూజిక్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టడానికి, అలానే అతను సూఫీయిజాన్ని స్వీకరించడానికి వెనుక ఆమె ప్రోత్సాహమే ఉంది. భర్త అనారోగ్యంతో మరణించిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆమె సూఫీయిజం ద్వారా స్వాంతన పొందింది. తన పేరును కరీమా బేగమ్ గా మార్చుకోవడంతో పాటు కుమారుడు దిలీప్ పేరును అల్లా రఖా రెహమాన్ గా మార్చింది. శేఖర్ కన్నుమూసిన పదేళ్ళ తర్వాత వీరి కుటుంబం మొత్తం ఇస్లాం మతాన్ని స్వీకరించింది. తల్లి కరీమా అంటే రెహమాన్ కు  ప్రేమతో పాటు గౌరవ భావమూ ఉంది. తాను సంగీత దర్శకుడు కాగలననే విశ్వాసాన్ని ఆమె కలగచేసిందని రెహమాన్ చెబుతుంటారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X