twitter
    CelebsbredcrumbAli
    ఆలీ

    ఆలీ

    Actor
    Born : 10 Oct 1967
    ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు టీవీ వ్యాఖ్యాత. ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. 1000 కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం... ReadMore
    Famous For
    ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు టీవీ వ్యాఖ్యాత. ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. 1000 కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు.

    సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందాడు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి గౌరవించారు. ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు. ఇతని తమ్ముడు ఖయ్యూం కూడా నటుడే. తెలుగు సినిమాలలో సహాయక పాత్రలను పోషించారు.


    దర్శకుడు కె. విశ్వనాథ్ ఆ సినిమాలో...
    Read More
    • కథ వెనుక కథ మూవీ ట్రైలర్
    • మా గంగానది మూవీ ట్రైలర్
    • 1
      ఆ పేరు వింటే ఎవరికీ అర్థం కాని భాషలో వింత శబ్ధాలతో చేసే కామెడీ గుర్తుకు వస్తుంది. ఎంద చాట, కాట్రవల్లి, అక్కుం బక్కుం, జంబల్ హాట్, జలగండ్రి లాంటి డిఫరెంట్ పదాలకు పుట్టిల్లు ఆ నోరు.
    • 2
      ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు టీవీ వ్యాఖ్యాత. ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు.
    • 3
      దాదాపు నాలుగు దశాబ్ధాలకు పైగా తెలుగు తెరపై నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఆ కామెడీ తోటమాలి పేరు ఆలీ.. పరిచయమే అవసరంలేని స్టార్ కమెడియన్..
    • 4
      1000 కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందాడు.
    • 5
      తెలుగులో ఒక్కో కమెడియన్ దీ ఒక్కో స్టైల్. అలా ఆలీది కూడా ఓ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కామెడీ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆలీ చిన్నప్పటినుంచే కమెడియన్. అంటే చైల్డ్ కమెడియన్ అన్నమాట.
    • 6
      బతుకు దెరువు కోసం నవ్వుల్ని వెంటబెట్టుకుని చిన్నప్పుడే చెన్నై చేరిన ఈ జలగండ్రి కేరాప్ మాస్ పత్రి 1967 అక్టోబర్ 10న రాజమండ్రిలో పుట్టాడు.
    • 7
      కెరీర్ తొలినాళ్లలో జంధ్యాల సినిమాల్లో చిన్న చిన్న వేశాలేసేవాడు. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి, ఇ.వి.వి. సత్యానారాయణ లాంటి దర్శకుల చేతిలో ఈ నవ్వుల రేడు రాటుదేలిపోయాడు.
    • 8
      ముఖ్యంగా ‘హలో బ్రదర్’ సినిమాలో బాగా తాగి ఇల్లు మర్చిపోయి, ఎన్టీఆర్ బంధువునంటూ ఆలీ పండించిన హాస్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేరేమో.
    • 9
      ఆలీ వివాహము జుబేదాతో జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహము. వీరికి ముగ్గురు సంతానము. పెద్ద కుమార్తె ఫాతిమా రమీజున్ బి. డి. ఎస్ విద్యార్థి. రెండో కుమార్తె జుబేరియా. కుమారుడు మహమ్మద్ బాషా. అలీ తమ్ముడు ఖయ్యూం అలియాస్ అజయ్ కూడా కొన్ని చిత్రాలలో నటించాడు. ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు.
    • 10
      ప్రేమఖైదీ సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు తో పాటు ఆలీ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎంద చాట అంటూ అలీ పలికిన అర్థం కాని మలయాళీ భాష అతనికి మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత ఇలాంటి సంభాషణలే పలు సినిమాల్లో వాడుకున్నారు.
    • 11
      కమెడియన్‌గా మంచి పీక్‌లో ఉన్నప్పుడే ఎస్వీ కృష్ణారెడ్డి తన సినిమాలో ఆలీని హీరోగా పెట్టి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. ముందు ఎన్నో కామెంట్స్ చేసినవారే ఆ తర్వాత ‘యమలీల’ విజయం చూసి ఆలీతో సినిమా తీసేందుకు క్యూ కట్టారు.
    • 12
      ఎప్పుడైనా ఆలీ కెరీర్ ను విశ్లేషిస్తే ‘యమలీల’ తర్వాత ముందు అనే చెప్పాల్సి ఉంటుందేమో. ఆ తర్వాత ఈ మూవీని హిందీలో వెంకటేశ్..‘తఖ్‌దీర్‌వాలా’గా రీమేక్ చేసారు.
    • 13
      ఇక కొన్ని పాత్రలు వేయాలంటే అది కొందరికే సాధ్యం. అలా ప్రస్తుతం తెలుగులో అటూ ఇటూ కానీ పాత్ర వేయాలంటే ఆలీ తప్ప వేరే ఆప్షన్ లేదు అనేంతగా పాపులర్ అయ్యాడు ఈ నచ్చిమి. ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్ ఇంకెవరైనా చేసినా అది ఆలీ తర్వాతే అంటారు ఆడియన్స్ కూడా.. ‘చిరుత’ మూవీలో మైనేమ్ ఈజ్ నచ్చిమి అంటూ అలీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
    • 14
      కొత్త వారొస్తున్నప్పుడు ప్రతి ఆర్టిస్ట్ కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ తెలుగు తెరకు ఎంతమంది కమెడియన్స్ పరిచయమైనా కాల్షీట్స్ ఖాళీలేని అతి కొద్దిమంది ఆర్టిస్టులలో ఆలీ ఒకరు. ‘వాసు’ సినిమాలో నటనకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత 2003లో ‘అమ్మ నాన్నా ఓ తమిళ అమ్మాయి’, 2005 లో ‘సూపర్’ చిత్రాల్లో నవ్వులు పంచినందుకు గానూ రెండు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌లు కూడా అందుకున్నాడు.
    • 15
      1999 లో జెమిని టివి అధినేత కిరణ్ కు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే కార్యక్రమం ఆలోచన ఆలీ ఇచ్చాడు. ఈ కార్యక్రమం ద్వారా చాలామంది నటులు, వ్యాఖ్యాతలు తయారయ్యారు. ఈటీవీ తెలుగులో ఆలీ 369, ఆలీ తో జాలీగా, ఆలీ తో సరదాగా మొదలైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
    • 16
      ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ కమెడియన్ గా ఉన్న ఆలీ టి. వి షోస్ లోనూ హంగామా చేస్తున్నాడు. అతను సృష్టించిన వింత శబ్ధాల కామెడీ కూడా ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీలో జాయిన్ అయ్యారు. అంతేకాదు ఆ పార్టీ తరుపున తన వంతు ప్రచారం నిర్వహించారు ఆలీ.
    • 17
      ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఇంకోవైపు టీవీ షోలతో ఆలీ ఫుల్లు బిజీగా ఉన్నాడు.
    ఆలీ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X