ఆలీ
Born on 10 Oct 1967 (Age 56)
ఆలీ బయోగ్రఫీ
ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు టీవీ వ్యాఖ్యాత. ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. 1000 కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు.
సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందాడు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి గౌరవించారు. ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు. ఇతని తమ్ముడు ఖయ్యూం కూడా నటుడే. తెలుగు సినిమాలలో సహాయక పాత్రలను పోషించారు.
దర్శకుడు కె. విశ్వనాథ్ ఆ సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చాడు. తర్వాత దేవుడు మావయ్య, ఘరానా దొంగ, సిరిమల్లె నవ్వింది, ముక్కోపి మొదలైన సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. తిరిగి రాజమండ్రి నుంచి చెన్నై తిరిగి వచ్చేశాడు. ఈ సినిమాలు చూసిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆయన నిర్మిస్తున్న సినిమా కోసం మళ్లీ చెన్నైకి పిలిపించాడు. ప్రఖ్యాత తమిళ దర్శకుడు భారతీరాజా ఆయన రూపొందిస్తున్న సీతాకోక చిలుక చిత్రం కోసం బాలనటుల కోసం చూస్తున్నాడని తెలిసి పరీక్ష కోసమని చెన్నైలో భారతీరాజా కార్యాలయానికి వెళ్ళాడు. ఆలీ ప్రతిభకు మెచ్చిన ఆయన తన చిత్రంద్వారా అవకాశం కల్పించాడు. ఈ సినిమా ఆలీకి నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది. తర్వాత బాల నటుడిగా కొన్ని చిత్రాలలో నటించాడు.
ప్రేమఖైదీ సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు తో పాటు ఆలీ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎంద చాట అంటూ అలీ పలికిన అర్థం కాని మలయాళీ భాష అతనికి మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత ఇలాంటి సంభాషణలే పలు సినిమాల్లో వాడుకున్నారు. అటు పిమ్మట యమలీల చిత్రంద్వారా కథానాయకుడిగా స్థిరపడ్డాడు.
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికి ఉత్తమ హాస్య నటుడి గా ఫిల్మ్ ఫేర్ పురస్కారం. సూపర్ (2005) సినిమాకి గాను ఉత్తమ హాస్య నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందింది.
సంబంధిత వార్తలు