twitter
    CelebsbredcrumbAllu ArjunbredcrumbBiography

    అల్లు అర్జున్ బయోగ్రఫీ

    అల్లు అర్జున్ తెలుగు సిని నటుడు అభిమానులందరు బన్నీ, స్టయిలిష్ స్టార్ అని పిలుసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్, 8 Apr 1983 అల్లు అరవింద్ మరియు శ్రీమతి నిర్మల  గారికి మద్రాసు లో జర్మించారు.

    స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ జననం మద్రాసులో జరిగింది. ప్రాదమిక విద్య అనంతరం యానిమేషన్ లో కోర్స్ పూర్తిచేసి కెనడాలో ఫై చదువులు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మెగాస్టార్ 'డాడీ' సినిమాలో ప్రత్యెక పాత్రలో నటించి ఆకర్షించాడు. ఆ తరవాత  అనూహ్యంగా వచ్చిన 'గంగోత్రి' (2003) సినిమాలో అవకాశంతో పూర్తిస్థాయి నటుడిగా మారాడు. 

    హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా, తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా అల్లు అర్జున్ తెరంగేట్రం తేలికగానే జరిగింది, కానీ దానిని సద్వినియోగం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఎర్పరచుకోవటంలో అల్లు అర్జున్ కృషిని అభినందిచవలసిందే. గంగోత్రి తరవాత ఓ వైవిధ్యమైన పాత్రలో నటించి 'ఫీల్ మై లవ్' అంటూ 'ఆర్య' గా  యువత మనసులో స్థానం సంపాయించాడు.

    ఆర్య తో తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ ప్రేక్షకుల మన్ననలు కూడా పొందాడు. ఇప్పటికీ మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అయ్యి విడుదల అవుతుండటం విశేషం. ఆ తరవాత రిలీజ్ అయిన 'బన్నీ' హిట్ తో హట్రిక్ పూర్తిచేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అక్కడనుంచి  చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక  ప్రత్యేకత చూపిస్తూ నటనలో ఇజ్ తో, డాన్సులో స్టైల్ తో ప్రేక్షకుల అభిమానం కొల్లగొట్టాడు. 

    'పరుగు' లో కృష్ణ గా చక్కని నటనతో ఆకట్టుకుని, 'వేదం' తో నవతరం నాయకులలో మల్టీ స్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు. అంతే కాకుండా ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్ ను సీరియస్ గా తీసుకుని  సిక్స్ ప్యాక్ బాడీ కల్చర్ ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత  అల్లుఅర్జున్ ది. 

    అవార్డులు:

    నంది అవార్డులు-3
    ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు-6
    ఐఫా అవార్డు-1
    సైమా అవార్డులు-5
    సిని’మా’ అవార్డులు-6
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X