Celebs » Balakrishna » Biography
బయోగ్రఫీ
నటసార్వబౌమ శ్రీ నందమూరి తారక రామరావు నటవారసునిగా తెలుగుతెరకు పరిచయం అయిన బాలకృష్ణ మద్రాస్ లో జన్మించారు. రామారావు గారి క్రమశిక్షణలో చదువుతోపాటు నటనలోను ఓనమాలు దిద్దుకున్నాడు అబిమానులు బాలయ్య అని ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ. 14 సంవత్సరాల వయసులోనే తన తండ్రి గారి దర్శకత్వంలో 1974 లో వచ్చిన 'తాతమ్మకల' చిత్రం ద్వారా సిని రంగప్రవేశం చేసారు. తరవాత పది సంవత్సరాల కాలంలో చాలావరుకు తన తండ్రిగారి దర్శకత్వం వహించిన 'అన్నదమ్ముల అనుభందం', 'దానవీర సూరకర్ణ' వంటి చిత్రాల్లో మాత్రమే నటించారు. 1984 లో మంగమ్మగారి మనవడు సినిమా ఘనవిజయంతో సోలోహీరోగా స్థిరపడ్డారు. తరవాత కధానాయకుడు, ముద్దులమామయ్య, లారిడ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి సూపర్ హిట్ లతో తెలుగు సిని పరిశ్రమ మూడో తరం టాప్ నలుగురు కధనాయకులలో ఒక్కరిగా ఉన్నారు. యన్.టి.ఆర్ తరవాత పౌరాణిక, జానపద చిత్రాలలో ఆకట్టుకునేవిధంగా నటించగల సత్తా బాలయ్యకే ఉంది అని 'బైరవ ద్వీపం', 'శ్రీకృష్ణార్జున విజయం' వంటి చిత్రాలతో నిరూపించాడు.    

పవర్ ఫుల్ డైలాగులు చెప్పడంలోను, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలో బాలయ్యకు మించినవాళ్ళు ఈతరంలో లేరు అనటం లో అతిశయోక్తి లేదు. బాలయ్య కు ఎన్ని విజయాలు ఉన్నాయో అన్ని పరాజయాలు ఉన్నాయి. కానీ ప్రతి పరాజయాల పరంపరను ఓ బ్లాక్ బాస్టర్ హిట్ తో తుడిచేయటం బాలయ్య అలవాటు. ఆ కోవలోకే వస్తాయి ముద్దుల కృష్ణయ్య, లారి డ్రైవర్, సమరసింహా రెడ్డి, సింహ, లెజెండ్ సినిమాలు. ప్రస్తుతం లయన్ సినిమా చేస్తున్నారు
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu