twitter
    CelebsbredcrumbChakribredcrumbBiography

    చక్రి బయోగ్రఫీ

    చక్రి అసలు పేరు చక్రధర్ జిల్లా. చక్రి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు మరియు నటుడు. ఇతడు జూన్ 15, 1974న వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో జన్మించాడు. ఇతను సంగీతం సమకూర్చిన సినిమాల్లో చెప్పుకోదగినవి ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, సత్యం. తెలుగులోనే కాక తమిళం, కన్నడంలో కూడా చక్రి సంగీతం సమకూర్చాడు. చక్రధర్ జిల్లా సంగీతం అందించిన చివ‌రి చిత్రం ఎర్ర‌బస్సు.


    పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు చక్రి దర్శకత్వం వహించాడు. ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి. సత్యం, శివమణి, దేశముదురు, గోపి గోపిక గోదారి, నేనింతే, మస్కా, సరదాగా కాసేపు, చక్రం, ఆంధ్రావాలా, ఇట్లు శ్రావణి, భగీరథ, ఢీ, రంగ ది దొంగ చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారు. చిన్న వయస్సులోనే చక్రి పలు హిట్‌సాంగ్స్ అందించారు. కొత్త గాయనీ, గాయకులు ఎంతో మందిని చక్రి టాలివుడ్‌కు పరిచయం చేశారు. శ్రీమన్నారాయణ, జై బోలో తెలంగాణ సినిమాలకు చక్రి సంగీతం అందించారు. . ఔను! వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో ఆ అభిప్రాయం తప్పని నిరూపించారు చక్రి. 


    'వెన్నెల్లో హాయ్.. హాయ్... మల్లెల్లో హాయ్... హాయ్..' అంటూ సంగీత ప్రియులను వెన్నెల్లో ఓలలాడించేశారు. వంశీ-చక్రి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలూ మ్యూజికల్‌గా బ్లాక్ బస్టర్లే కావడం విశేషం. ముఖ్యంగా గోపీ గోపిక గోదావరి చిత్రంలోని 'నువ్వక్కడుంటే.. నేనిక్కడుంటే... ప్రాణం విలవిల ' పాటైతే... మొబైళ్లలో కాలర్‌ట్యూన్‌గా మోత మోగించింది. 

    సింహా సినిమాకిగాను నంది ఉత్తమ సంగీతదర్శకులు  అవార్డు వరించింది. డిసెంబ‌ర్14 రాత్రి చక్రికి గుండెపోటు రావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఐసీయూలో 2014, డిసెంబర్ 15 న తుదిశ్వాస విడిచారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X