twitter

    చలపతి రావు బయోగ్రఫీ

    చలపతిరావు  కృష్ణా జిల్లా బల్లిపర్రులో 1944 మే 8న జన్మించారు. చలపతి రావుకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు. కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. చలపతిరావు 1200కు పైగా సినిమాల్లో నటించారు.

    ఎన్టీఆర్‌, కృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్‌ చిత్రాల్లో ఆయన సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ‘కలియుగ కృష్ణుడు’, ’కడప రెడ్డమ్మ’, ‘జగన్నాటకం’, ‘పెళ్లంటే నూరేళ్ల పంట’తదితర సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు. 

    ‘యమగోల’, ‘యుగపురుషుడు’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘అక్బర్‌ సలీమ్‌ అనార్కలి’, ‘భలే కృష్ణుడు’, ‘సరదా రాముడు’, ‘జస్టిస్‌ చౌదరి’, ‘బొబ్బిలి పులి’, ‘చట్టంతో పోరాటం’, ‘దొంగ రాముడు’, ‘అల్లరి అల్లుడు’, ‘అల్లరి’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘నువ్వే కావాలి’, ‘సింహాద్రి’, ‘బన్నీ’, ‘బొమ్మరిల్లు’, ‘అరుంధతి’, ‘సింహా’, ‘దమ్ము’, ‘లెజెండ్‌’ ఇలా ఎన్నో వందల చిత్రాల్లో ఆయన కీలకపాత్రలు పోషించారు.  గతేడాది విడుదలైన ‘బంగార్రాజు’ తర్వాత చలపతిరావు వెండితెరపై కనిపించలేదు.

     గుండెపోటుతో ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 

    అనారోగ్య సమస్యలతో కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న చలపతిరావు గుండెపోటుతో 2022 డిసెంబర్ 25న  తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X