twitter
    CelebsbredcrumbJamunabredcrumbBiography

    జమున బయోగ్రఫీ

    1936 ఆగస్టు 30న హంపీలో జన్మించిన జమున 1953లో 'పుట్టిల్లు' అనే సినిమాతో తెరంగేట్రం చేశారు.  తండ్రి నిప్పణి శ్రీనివాసరావు, తల్లి కౌసల్య దేవి. చిన్నపుడే తల్లి దగ్గర హార్మోనియం, సంగీతంతో పాటు డాన్సుల్లో ప్రావీణ్యం సంపాదించుకుంది. ఆమె అసలు పేరు జానా భాయి. జ్యోతిష్య పండితుల సూచన మేరకు జమున గా పేరు మార్చారు.

    గుంటూరు జిల్లా దుగ్గిరాల బాలికల పాఠశాల చదివింది. ఆ రోజుల్లోనే జమునకు ఎన్నో నాటకాల్లో నటించిన అనుభవం ఉంది. అలా జగ్గయ్యకు చెందిన ‘ఖిల్జీరాజు పతనం’తో నాటకాల్లో ప్రవేశించింది. అలా నాటకాల్లో నటిస్తూనే సినిమా రంగంపై ఆసక్తి పెంచుకుంది. నటిగా జమున ఫస్ట్ మూవీ పుట్టిల్లు.

    సత్యభామ దర్పానికి, రాణీ మాలీని దేవి అహంకార ప్రదర్శనకు, అన్నపూర్ణ సహనానికీ, అరుంధతి ఓర్పుకు, కలెక్టర్ జానకి హుందాతనానికీ, గౌరమ్మ చిలిపితనానికీ, చిరునామా. ఆర్ద్రతకు, అనురాగానికి, అనుబంధానికి ప్రేమకు ప్రతీకగా నిలిచే జమున అభినయం నేటి తరం కథానాయికలకు పాఠాలు. అందుకే పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం నటిగా జమున ప్రత్యేకత

    తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో కొన్ని వందల చిత్రాల్లో ఆమె నటించారు.ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీ రంగారావు, కృష్ణ సహా పలువురు దిగ్గజ నటులతో ఆమె నటించి సినీ ప్రియులను అలరించారు.

    తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.

    తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారామె.

    1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా, 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X