twitter
    CelebsbredcrumbJr. NtrbredcrumbBiography

    జూనియర్ యన్ టి ఆర్ బయోగ్రఫీ

    నందమూరి తారక రామారావు తెలుగు సిని నటుడు అభిమానులందరు జూనియర్ యన్.టి.ఆర్, తారక్ రామ్, యంగ్ టైగర్  అని పిలుచుకుంటారు. 20 may 1983 నందమూరి హరికృష్ణ మరియు శ్రీమతి శాలిని కి జూనియర్ యన్.టి.ఆర్ హైదరాబాద్ లో జన్మించాడు.గుడివాడలోని మొంటిస్సోరి స్కూల్ లో చదివిన యన్.టి.ఆర్ ఇంటర్ మీడియట్ ను హైదరాబాద్ లోని సెయింట్ మేరీ జూనియర్ కాలేజీ లో కొనసాగించారు. 


    చదువు తో పాటే నటనలోను, కూచిపూడి నాట్యంలోనూ ఓనమాలు దిద్దాడు జూనియర్. అప్పుడు కూచిపూడి డాన్సులో తీసుకున్న శిక్షణ మూలంగానే ఇప్పుడు ఎటువంటి నృత్య రీతిని అయిన అవలీలగా ప్రదర్శిస్తూ డాన్సర్ గా అబిమానులను అలరిస్తున్నాడు. నటనలో ఆడుగులు వేయటం తాతగారి వద్ద నేర్చుకున్న జూనియర్, సీనియర్ యన్.టి.ఆర్ దర్శకత్వం వహించిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా వెండితెర మీద తోలి పాదం మోపాడు.  ఐదు సంవత్సరాల తరవాత  'బాల రామాయణం' చిత్రంలో రాముడుగా నటించాడు.


    'నిన్నుచుడాలని' సినిమాతో తోలిసారి హీరోగా చేసాడు, కానీ  అదే సంవత్సరం లో వచ్చిన ' స్టూడెంట్ నెం .1' మంచి విజయం సాదించి అతి చిన్న వయసులో యన్.టి.ఆర్ సాదించబోయే సంచలనాలకు తోలి మైలు రాయిగా నిలిచింది.  'ఆది' తో కలక్షన్ల వర్షం కురిపించి మాస్ కు దగ్గరయ్యాడు. సింహాద్రి లో నట విశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకుల చేత దాసోహం అనిపించాడు. 20 సంవత్సరాలకే  స్టార్ హీరో గా ఎదిగిపోయిన యన్.టి.ఆర్ ఆ తరవాత కెరీర్ లో కొన్ని తప్పటడుగులు పడ్డాయి.  సరిగ్గా అదే సమయంలో దర్శకుడు రాజమౌళి ప్రోత్సాహంతో తన రూపు రేఖలను మార్చుకుని సరికొత్తగా 'యమదొంగ' చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంభ్రమాశ్చర్యాలు కలుగచేసాడు.  


    బోయపాటి శీను" దర్శకత్వంలో వచ్చిన "దమ్ము" చిత్రం అతని నటనకు మరోసారి నిలువుటద్దంలా నిలిచినా, ప్రేక్షకుల మరియు అభిమానులను మెప్పించలేకపోయింది . శ్రీనువైట్ల దర్శకత్వంలో "బాద్ షా" చిత్రం మంచి విజయాన్ని అందుకుని మంచి వసుళ్ళు సాధించింది.తరువాత వచ్చిన రామయ్యా వస్తావయ్యా మరియు రభస అనే చిత్రాలు అభిమానుల మన్ననలు కూడా పొందలేకపోయాయి.  దర్శకుడు పురి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ నటించి ఎన్నో ఏళ్ళుగా అందని ద్రాక్షలా ఉన్న విజయాన్ని అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటించాడు .2017 దసరాకి జై లవ కుశ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించాడు. ఈ మధ్య బుల్లితెరలో కూడా షో ద్వారా తను ఏంటో నిరూపించుకుంటున్నాడు.


    ఈతరం నటులలో అభినయంతో డైలాగులు చెప్పడం, మైమరిపించేల డాన్సులు వేయటం ఇలా అన్ని కళలు సమపాళ్ళలో కలిగిన నటుడు యన్.టి.ఆర్ ఒక్కడే అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. యమదొంగ తరవాత నుండి ఏ ఒక్క వర్గానికో కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విదంగా ఆదుర్స్, బృందావనం వంటి సినిమాలను ఎంచుకుని విజయ పధాన పయనిస్తూ ముందుకు సాగుతున్నాడు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X