twitter
    CelebsbredcrumbKaikala Satyanarayana
    కైకాల సత్యనారాయణ

    కైకాల సత్యనారాయణ

    Actor/Producer/Actress
    Born : 25 Jul 1935
    Birth Place : హైదరాబాద్
    కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ... ReadMore
    Famous For
    కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు.

    కాలేజీ రోజుల్లోనే కైకాలకు నాటకాలపై ఆసక్తి పెరిగింది. నటుడు కావాలని కలలు కంటూ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. వెండితెరకు హీరోగా పరిచయమైన కైకాల.. ఐదు తరాల హీరోలతో సినిమాలు చేశారు. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు...
    Read More
    • 1
      దాదాపుగా 28 పౌరాణిక పాత్రలు, 50 కి పైగా జానపద పాత్రలు, 10కి పైగా చారిత్రాత్మక పాత్రలు పోషించారు కైకాల.
    • 2
      కైకాల తన ఫిల్మ్ కెరీర్ లో దాదాపు గా 200 మంది దర్శకులతో పనిచేశారు. 50కి పైగా హీరోలతో నటించారు.
    • 3
      తన కుటుంబం నుంచి ఒక్కరినైనా ఇండస్ట్రీలో తన వారసుడిగా పరిచయంచేయాలి అనుకున్నారు కైకాల. కాని ఆయన ఆశ తీరలేదు.
    • 4
      కైకాల కుటుంబం నుంచి నటులుగా ఎవరూ సిల్వర్ స్క్రీన్ మీదకు రాలేదు.
    • 5
      కైకాల సత్యనారాయణ నటించిన 230కి పైగా సినిమాలు థియటర్లలో 100 రోజులు ఆడాయి
    • 6
      60 సినిమాల వరకూ 50 రోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేశాయి.
    • 7
      దాదాపు 10 సినిమాలో ఏడాది వరకూ థియేటర్లో సందడి చేసి...రికార్డ్ క్రియేట్ చేశాయి.
    • 8
      రికార్డ్ స్థాయిలో ఎన్టీఆర్ తో 100కు పైగా సినిమాల్లో నటించారు కైకాల సత్యనారాయణ.
    • 9
      కైకాల ఇండస్ట్రీకి వచ్చిన కోత్తలో ఎన్టీఆర్ డూప్ గా పిలిచేవారు. రాముడు భీముడు లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ డూపు గా కూడా సత్యనారాయణ పనిచేశారు
    • 10
      యముడిగా ఎక్కువ సార్లునటించిన కైకాల... దుర్యోధనుడిగా, రావణాసురిడిగా, దుర్యోధనుడిగా, దుస్సాసనుడిగా, ఇంద్రుడిగా, ఘటోద్గచుడిగా ఇలా ఎన్నో పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించారు కైకాల సత్యణారాయణ.
    • 11
      90 ఏళ్ళ తెలుగు సినిమాలో ఆయన వంతు 60 ఏళ్లకు పైనే.
    కైకాల సత్యనారాయణ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X