twitter
    CelebsbredcrumbKajal Aggarwal
    కాజల్ అగర్వాల్

    కాజల్ అగర్వాల్

    Actress/Actor
    Born : 19 Jun 1985
    Birth Place : ముంబాయి, మహరాష్ట
    కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటీమణి. కాజల్ 1985 జూన్ 19న ముంబాయిలో జన్నించింది. కాజల్  మోడల్ మరిము నటీమణి కూడా. ఈమె తెలుగు తమిళ భాషల్లో నటించింది. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఆరంగేట్రం చేసింది. ఈమె 2008 లో శివ బాలాజీ,... ReadMore
    Famous For
    కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటీమణి. కాజల్ 1985 జూన్ 19న ముంబాయిలో జన్నించింది. కాజల్  మోడల్ మరిము నటీమణి కూడా. ఈమె తెలుగు తమిళ భాషల్లో నటించింది. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఆరంగేట్రం చేసింది.


    ఈమె 2008 లో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన చందమామ సినిమాలో కథానాయికగా నటించింది. ఈమె 2009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే.మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది. తర్వాత 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్...
    Read More
    • సత్యభామ టైటిల్ గ్లింప్సె
    • భగవత్ కేసరి టీజర్
    • ఆచార్య మూవీ ట్రైలర్
    • సాన కష్టం సాంగ్ ప్రోమో- ఆచార్య
    • సిద్ద సాగ టీజర్ - ఆచార్య
    • నీలాంబరి లిరికల్ సాంగ్ - ఆచార్య
    • 1
      కాజల్ అగర్వాల్.. అసలు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని పేరు. పదిహేనేళ్ళుగా హీరోయిన్ గా కొనసాగుతోంది.
    • 2
      టాప్ స్టార్ల నుండి యంగ్ హీరోల వరకూ దాదాపుగా అందరితో నటించిన కాజల్ పేరు తెలియని తెలుగు సినీ ప్రేమికుడు ఉండడు.
    • 3
      కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న మహారాష్ట్రలోని ముంబాయి లో జన్మించింది. నిషా అగర్వాల్ చెల్లేలు.
    • 4
      ఈమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది.
    • 5
      2009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే.
    • 6
      హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది. తర్వాత 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది.
    • 7
      తర్వాత జూనియర్ ఎంటీయార్ తో బృందావనంలో సమంతతో పాటుగా నటించింది. తరువాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించారు.
    • 8
      చిరంజీవీ రీఎంట్రీ ఖైధీ నెం 150 లో హిరోయిన్ గా నటించింది. చిరంజీవి, రామ్ చరన్ ఇద్దరి కి హీరోయిన్ గా చేసి రికార్డ్ నెలకొల్పింది.
    • 9
      కాజల్ అగర్వాల్ ట్విట్టర్ లో 2.67 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో 10.9 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.
    • 10
      కాజల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగులో శర్వానంద్ 'రణరంగం' లో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో 'కోమలి'.. 'ప్యారిస్ ప్యారిస్' సినిమాల్లో నటిస్తోంది. శంకర్ - కమల్ హాసన్ 'ఇండియన్ 2' లో కూడా కాజల్ అగర్వాలే హీరోయిన్.
    • 11
      సమయం దొరికినప్పుడల్లా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో యువత గుండెల్లో కాక పెంచుతూ వుంటుంది. చూడాలి మరి ఇంకెన్నాళ్ళు కాజల్ గ్లామర్ కి గిరాకి ఉంటుంది అన్నది.
    • 12
      దాదాపు 15 ఏళ్లుగా కెమెరా ముందు రాణిస్తున్న కాజల్.. అందరు అగ్ర హీరోల సరసన నటించింది. అంతేకాదు 50 సినిమాల మార్క్ కూడా దాటేసిన హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.
    • 13
      చిరంజీవి రీ ఎంట్రీ హీరోయిన్‌గా ‘ఖైదీ నంబర్ 150’లో ఆయనతో రొమాన్స్ చేసింది కాజల్. అలా తండ్రీకొడుకులు చిరంజీవి,రామ్ చరణ్ సరసన నటించిన హీరోయిన్‌గా కూడా అమ్మడికి స్పెషల్ పాపులారిటీ ఉంది.
    • 14
      ప్రస్తుతం సీనియర్, జూనియర్ హీరోలందరికీ బెటర్ ఛాయిస్‌గా ఉన్న ఈ ముద్దుగుమ్మ చిరంజీవితో 'ఆచార్య' సినిమాలో, కమల్ హాసన్‌తో 'భారతీయుడు 2' మూవీలో అలాగే మంచు విష్ణు సరసన 'మోసగాళ్లు' మూవీలో నటిస్తోంది.
    • 15
      ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ అగర్వాల్ విగ్రహాన్ని ఉంచడం అమ్మడికి దక్కిన అరుదైన గౌరవం. ఈ మ్యూజియంలో స్థానం సంపాదించిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్‌గా కాజల్ రికార్డు సృష్టించింది.
    • 16
      అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, మహేష్ బాబు, ప్రభాస్, కాజోల్, కరీనా కపూర్ విగ్రహాలతో పాటు కాజల్ విగ్రహాన్ని ఉంచడం విశేషం.
    కాజల్ అగర్వాల్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X