twitter
    CelebsbredcrumbKJ YesudasbredcrumbBiography

    కె జె ఏసుదాసు బయోగ్రఫీ

    కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్ పూర్తి పేరు. యేసుదాస్ భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు మరియు గాయకుడు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. ఏడు జాతీయ పురస్కారాలు మరియు కేరళ ప్రభుత్వం తరపున 24 సార్లు, కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐదు సార్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆరు సార్లు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒకసారి ఉత్తమ గాయకుడి పురస్కారాలందుకున్నాడు. ఈయన శాస్త్రీయ సంగీతం, భక్తిగీతాలు మరియు సినిమా పాటల గాయకుడిగా సుపరిచితుడు. వివిధ భారతీయ భాషల్లో దాదాపు 40,000 పాటలు పాడాడు. తెలుగు సినీపరిశ్రమలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. మోహన్ బాబు గారు ఆయన సినిమాల్లో ఏసుదాసుగారి చేత కనీసం ఒక్క పాటైనా పాడించుకునే్వారు.
    యేసుదాస్ సతీమణి ప్రభ. వీరికి ముగ్గురు సంతానం, వినోద్, విజయ్ మరియు విశాల్. విజయ్ యేసుదాస్ కూడా సంగీతాభిరుచి గలవాడు. వీరు చెన్నై మరియు కేరళలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఏసుదాసు పాడిన అయ్యప్ప పాటలు కూడా ఎంతో పేరు గాంచాయి. అయ్యప్పు పవళింపు కోసం ఆయన పాడిన హరివరాసనం పాట శబరిమలలో ఇప్పటికీ వినిపిస్తారు. తెలుగులొ ఏసుదాస్ పాడిన సినిమాలు మేఘసందేశం, జీవన జ్యోతి, గంగ, అంతులేని కథ, నిరీక్షణ, అమ్మ రాజీనామా మొదలైన సినిమాలకి తెలుగు గొప్ప పాటలు పాడారు.
    అవార్డులు:

     
    పద్మవిభూషణ్ :2017
     
    పద్మభూషణ్  : 2002
     
    పద్మశ్రీ  : 1973
     
    ఇంకా మరేన్నో ...




     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X