twitter

    మురళి మోహన్ బయోగ్రఫీ

    మాగంటి మురళీమోహన్ ఇతని అసలు పేరు మాగంటి రాజబాబు. ఇతడు 1940, జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించాడు తెలుగు సినిమా కథానాయకుడు మరియు నిర్మాత. జయభేరి గ్రూపు అధిపతి.

    ఇతని తండ్రి మాగంటి మాధవరావు స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతని విద్యాభ్యాసం ఏలూరులో గడిచింది. ఇతడు 1963లో ఎలెక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించాడు. తరువాత ఇతడు విజయవాడలో నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు.

    1973లో మురళీమోహన్ అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశాడు. దాసరి నారాయణరావు 1974లో తీసిన తిరుపతి సినిమాతో ఇతనికి నటునిగా గుర్తింపు వచ్చింది. ఇతడు సుమారు 350 తెలుగు చలనచిత్రాలలో నటించాడు. 

    ఇతడు రాజకీయాలలో కూడా ప్రవేశించి తెలుగు దేశం పార్టీలో చేరాడు. 2009లో జరిగిన 15వ లోకసభ ఎన్నికలలో రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి తెలుగు దేశం అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ కుమార్ చేతిలో 2,147 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. తిరిగి 2014లో 16వ లోకసభ ఎన్నికలలో గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 2019 ఎలక్షన్ లో  ఆరోగ్య కారణాల రిత్య పోటో చేయలేదు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X