Celebs » Naga Chaitanya » Biography
బయోగ్రఫీ
అక్కినేని నాగచైతన్య తెలుగు సిని నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు మరియు విక్టరి వెంకటేష్ మేనల్లుడు, ఇద్దరు దాదా సాహెబ్ ఫాల్కే ల ముద్దుల మనవడిగా, నాన్న, మేనమామల నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకుని హీరోగా పరిచయం అయిన అక్కినేని నాగచైతన్య హైదరాబాద్లో పుట్టాడు. అమ్మ నాన్నల మద్య కలతలకారణంగా తల్లితో పాటు మద్రాస్ వెళ్ళిన చైతు ప్రాధమిక విద్యను అక్కడి పి.యస్.బి.బి స్కూల్ లో కొనసాగించాడు. చదువుకునే రోజుల్లో గిటార్, డ్రమ్స్ ను వాయిస్తూ బ్యాండ్ లో పాల్గొనేవాడు. మొదట్లో నటన మీద ఆసక్తి కనబరచని చైతు కార్ రేసింగ్ అంటే ఇష్టపడేవాడు. కానీ తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో నటన వైపు అడుగులు వేసాడు. ముంబైలోని యాక్టింగ్ స్కూల్ లోను, కాలిఫోర్నియా హాలీవుడ్ స్టూడియోలోను నటనలో శిక్షణ తీసుకున్నాడు. 

నాగచైతన్యని  'జోష్' చిత్రం ద్వారా తెలుగు తెరకు గ్రాండ్ గా పరిచయం చేసాడు నాగార్జున, నటన నాన్నది, స్టైల్ మేనమామ వెంకిది అందిపుచ్చుకున్న నాగచైతన్య తోలి సినిమా పూర్తి కాకుండానే తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రం 'ఏం  మాయ చేసావే' లో ఛాన్స్ కొట్టేసాడు. భారీ అంచనాలతో విడుదల అయిన 'జోష్' బాక్స్ ఆఫీసు దగ్గర సందడి చేయలేకపోయినా నటుడిగా చైతుకు గుర్తింపు నిచ్చింది. ఆ తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా విడుదల అయిన  'ఎం మాయ చేసావే' సినిమా హిట్ అవటంతో చైతు హీరోగా నిలదొక్కుకున్నాడు.

తర్వత నాగచైతన్య సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ స్టోరి మంచి విజయం సాదించింది, ప్రస్తుతం మనం సినిమాలో నాన్నా, తాత తో నటించే అదృష్టం కలిగింది. నాగచైతన్య ఒక లైలకోసం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది