twitter

    నాగార్జున అక్కినేని బయోగ్రఫీ

    అక్కినేని నాగార్జున తెలుగు సిని నటుడు తెలుగు సినిమా అభిమానులు  యువ సామ్రాట్, కింగ్ అని పిలుచుకుంటారు, నాగార్జున మద్రాస్ లో జన్మించారు. ప్రాధమిక విద్య హైదరాబాద్ లోని 'హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోను, ఇంటర్ మీడియట్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ లో పూర్తిచేసారు. అన్నా యూనివర్సిటీ, యూనివర్సిటీ అఫ్ మిచిగాన్ ల నుండి మెకానికల్ ఇంజినీరింగ్ లో పట్టబద్రులు అయ్యారు.

     'విక్రం' సినిమాతో తెలుగు సినీరంగానికి పరిచయం అయ్యారు. ఈ సినిమాతో నటునిగా మంచి మార్కులు పడిన తరవాత చాలాకాలం సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'ఆఖరి పోరాటం' ఘన విజయంతో నాగార్జున హీరోగా స్థిరపడ్డారు.  మణిరత్నం 'గీతాంజలి, రామ్ గోపాల్ వర్మ 'శివ' వరస విజయాలతో స్టార్ ఇమేజ్ సంపాయించుకున్నారు. గీతాంజలి తో లవర్ బాయ్ గా ఆకటుకున్న నాగార్జున, శివ తో తెలుగు సినిమా స్థితిని మార్చి ట్రెండ్ సెట్టర్ అయ్యారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు, హలో బ్రదర్ .. వంటి  సినిమాలతో మాస్ ప్రేక్షకులను ఆకర్షించారు. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి చిత్రలతో ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందారు.  తెలుగు సినిమా గురించి తెలిసిన ప్రతి హీరోయిన్ నాగార్జున తో ఒక్కసారి అయిన నటించాలి అని ఉటుంది అని అనటంలో అతిశయోక్తి లేదు. నాగార్జున తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ మరియు హిందీ బాషలలో కూడా నటించి పేరు ప్రఖ్యాతలు  గడించారు. 
    ఊపిరి నిర్మల కాన్వంట్, సోగ్గాడె చిన్ని నాయన, ఓం నమో వెంకటేశాయ, రాజుగారి గది, ఆఫిసర్, దెవదాస్ వంటి చిత్రాలలొ నటించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X