twitter
    CelebsbredcrumbNitinbredcrumbBiography

    నితిన్ రెడ్డి బయోగ్రఫీ

    నితిన్ తెలుగు సిని నటుడు మరియు ప్రముఖ సినిమా డిస్త్రిబ్యుటర్ సుధాకర్ రెడ్డి తనయుడిగా సిని పరిశ్రమలోకి అడుగిడిన నితిన్ నిజామాబాదు లో జన్మించాడు. వ్యాపారరీత్యా హైదరాబాద్ చేరుకున్న ఫ్యామిలీ తో హైదరాబాద్లోనే ఉంటూ చదువు కొనసాగించాడు. గండి పేటలోని సాదన ఇంజినీరింగ్ కాలేజీ లో బి.టెక్ 2 వ సంవత్సరం చదువుతున్న సమయంలో ఓ రోజు 'నువ్వు నేను' సినిమాకు వెళ్ళిన నితిన్ అక్కడే ఉన్న డైరెక్టర్ తేజ దృష్టిని ఆకర్షించాడు. ఆ తరవాత 'జయం' సినిమా తీసే పనిలో ఉన్న తేజ కు నితిన్ సరిపోతాడు అనిపించి ఆడిషన్ చేసి ఓకే చేసాడు. జయం ఘన విజయం సాదించడం తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నితిన్ కు  వెంటనే  వి.వి.వినాయక్, రాజమౌళి వంటి పెద్ద  దర్శకుల నుండి ఆవకాశాలు రావడం, 'దిల్', 'సై' సంచలన విజయాలు సాదించడంతో హీరోగా స్థిరపడటమే కాకుండా మంచి మార్కెట్ కూడా సృష్టించుకున్నాడు. అది ఎంతల అంటే వరసగా 13 పరాజయాలు ఎదురైనా సరే  నితిన్ సినిమాకు మంచి ఓపెనింగ్ కలక్షన్లు ఉంటాయి అందువల్ల నష్టం పెద్దగా ఉండదు. అందుకే నితిన్ చేతిలో ఎప్పుడు సినిమాలు ఉంటూనే ఉంటాయి.

    కొత్త వారికీ ఆవకాశాలు ఇవ్వడంతో పాటు, కొత్త దానాన్ని చూపించడం లోను తన శక్తిమీరా శ్రమపడతాడు నితిన్,  విక్టరీ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీ తో అలరించడమే అందుకు నిదర్సనం. మొదట్లో లవర్ బాయ్ గా పరిచయమైనా దిల్, సై చిత్రాలతో మాస్ ఇమేజ్ ను సంపాయించుకున్నాడు. సంబరం, శ్రీ ఆంజనేయం వంటి క్లాసు సినిమాలు చేసినా యాక్షన్ సినిమాలకే పెద్ద పీట వేసాడు. 'సై' తరవాత ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా అంతగా కలిసి రాలేదు. తర్వత నితిన్ కి మళ్ళి విజయాల బాటాలొ నడిపించిన సినిమా ఇష్క్ ఈ సినిమాతో వెనక్కి తిరిగి చూడకుండ గుండేజారి గల్లంతైంది, హర్ట్  హెటాక్ విజయాల బాట నడిచాయి.

    నితిన్ ప్రస్తుతం చిన్నాదాన నీకోసం అనే సినిమా 12-25-2014 విడుదల కానుంది. అలాగే ఇంకో సినిమా కొరియర్ బాయ్ కళ్యాన్ నిర్మాణం పూర్తి చేసుకోని విడుదలకు సిద్దంగా ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X