twitter

    పవన్ కల్యాణ్ బయోగ్రఫీ

    పవన్ కల్యాణ్ తెలుగు సిని నటుడు మరియు దర్శకుడు, అభిమానులు ప్రేమగా పవన్ స్టార్ అని పిలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ కి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా,  గబ్బర్ సింగ్, గోపాల గోపాల, సర్దార్ గబ్బర్సిం గ్, కాటమరాయుడు మరియు ఆజ్ఞతవాసి వంటి సినిమాలలో నటించారు.

    పవన్ కళ్యాణ్ కొణిదల వెంకట్రావ్  శ్రీమతి అంజనా దేవి గారికి  చీరాల, ఆంద్రప్రదేశ్  02 sep 1971 లొ జర్మించారు. పవన్ తండ్రి సొంత ఊరు మొగల్తూరు అయిన ఉద్యోగరీత్యా చీరాలలో ఉన్నప్పుడు పవన్ పుట్టాడు. ఇంటర్ మీడియట్ తో చదువుకు స్వస్తిచెప్పిన కళ్యాణ్, తరవాత మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానాన్ని పెంచుకుని శిక్షణ తీసుకున్నాడు. కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గా పేరు మార్చుకుని 1996 లో 'అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. 


    తరవాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం చిత్రాలు హీరో గా నిలబెట్టాయి. 1999 లో వచ్చిన 'తొలిప్రేమ' లో బాలు గా యువతరాన్ని ఆకట్టుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇప్పటి వరకు పవన్ చేసిన  15 సినిమాలతోనే నాలుగోతరం అగ్ర హీరోలలో ఒకరిగా   వెలుగొందుతున్నారు. పవన్ ఎప్పుడు ఏదో ఒక కొత్త స్టైల్ తో, వెరైటి సంభాషణలతో యూత్ ని కట్టిపడేసాడు. సామాన్య ప్రజలే కాకుండా వెంకటేష్, మహేష్ బాబు లాంటి తోటి నటులు కూడా పవన్ ని ఇష్ట పడటానికి కారణం కూడా అవే. పవన్ కళ్యాణ్ నటుడిగానే కాకుండా దర్శకుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. జపాన్ దర్శకుడు అకీరా కురసోవా ను అమితంగా ఇష్ట పడే పవన్ ఆయన స్పూర్తి తో దర్శకుడుగా 'జానీ' చిత్రాన్ని రూపొందించాడు. 


    గబ్బర్ సింగ్ కుగాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకొన్నారు. అత్తారింటికి దారేది చిత్రం వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టినది. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు నిర్మిస్తాడు. గోపాల గోపాల చిత్రంలో మోడరన్ కృష్ణునిగా నటించారు. సర్దార్ గబ్బర్ సింగ్, ప్రారంభంలో కాటమరాయుడు సినిమాలలో నటించారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ చిత్రం ఆజ్ఞతవాసిలో నటించారు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X