పూజా హెగ్డే
Born on 13 Oct 1990 (Age 34) ముంబాయి మహారాష్టా
పూజా హెగ్డే బయోగ్రఫీ
పూజా హెగ్డే ఒక భారతీయ సినీ నటి మరియు మోడల్. అక్టోబరు 13, 1990న ముంబై లో పుట్టి పెరిగింది.పూజ తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. వీరి స్వస్థలం కర్ణాటక లోని మంగుళూరు. 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది.
2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో నటించింది. 2014 లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది. 2016 లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో హింది సినిమాలో నటించింది. ఆతరువాత వచ్చిన అన్ని అవకాశాలను వదలకుండ నటించింది. వాటిలో దువ్వాడ జగన్నాధం(2017), రంగస్థలం(2018)చిత్రంలో పాటలో ప్రత్యేక పాత్ర చేసించింది, సాక్ష్యం(2018), అరవిందసమేత వీర రాఘవ(2018). త్వరలో మహేష్ సరసన మహర్షి సినిమాలో నటించబోతోంది.
సంబంధిత వార్తలు