twitter
    CelebsbredcrumbPrabhasbredcrumbBiography

    ప్రభాస్‌ బయోగ్రఫీ

    ప్రభాస్  పూర్తి పేరు 'ఉప్పలపాటి ప్రభాస్ రాజు',  ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. 1979 అక్టోబరు 23 చెన్నెయ్ లో జన్మించారు. శివ కుమారి, సూర్యనారాయణా రాజు వీరి తల్లిదండ్రులు.

    అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, మరియు ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. ఇతను ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ప్రముఖ నటులు గొపిచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్ ప్రభాస్ కు మంచి స్నేహితులు.

    ఈశ్వర్ సినిమాతో  తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయమయ్యాడు. చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలివంటి సినిమాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటు ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు. ప్రభాస్ అభిమానులు డార్లింగ్ అని ముద్దుగా పిల్చుకుంటారు. బాహుబలి చిత్రంతో ప్రపంచస్థాయిలో గుర్తింపుతెచ్చుకున్నాడు.

    ఇక బాహుబలి 2 పార్ట్‌తో భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరో నమోదు చేయని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాడు.

    తాజాగాా ‘సాహో’ తో పలకరించాడు. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ముఖ్యంగా నార్త్‌లో ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది.

    ఇక బాహుబలితో వచ్చిన ఈ క్రేజ్ వల్లే థాయిలాండ్‌లోని  మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బాహుబలి రూపంలో ఉన్న  ప్రభాస్ మైనపు బొమ్మ పెట్టారు. దక్షిణాది నుంచి ఈ ఘనత అందుకున్న మొదటి హీరో ప్రభాస్.

    రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ప్రభాస్ రెండు సినిమాల్లో నటించాడు. బిల్లా, రెబల్ లాంటి మాస్ సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించకపోయినా.. వీళ్లిద్దరి కలిసి నటించడం ఫ్యాన్స్‌కు ఆనందింపచేసాయి. 


     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X