twitter

    ఆర్ నారాయణ మూర్తి బయోగ్రఫీ

    నారాయణమూర్తి తెలుగు సినిమా నటుడు/ దర్శకుడు/నిర్మాత/ సంగీత దర్శకుడు/ గీత రచయిత. ఇతను 1953 డిసెంబరు 31న తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించాడు.   నారాయణమూర్తి హేతువాది, అవివాహితుడు.

    తెలుగు సినిమారంగంలో ఎర్రసైన్యం సినిమా ఒక ట్రెండును సృష్టించింది. ఆ తర్వాత అనేక పెద్ద నిర్మాతలు ఇలాంటి మూసలో అనేక సినిమాలు నిర్మించి, విడుదల చేశారు. అలా మూస చిత్రాల ఉధృతి ఎక్కువై, ఆ తర్వాత వచ్చిన సినిమాలకు అంతగా ఆదరణ లభించలేదు. నారాయణమూర్తి ఒక పది సంవత్సరాల పాటు తీసిన సినిమాలు చాలా విజయవంతమయ్యాయి. ఆ తరువాత ఏడు సంవత్సరాల పాటు వరుస పరాజయాలను చవిచూశాడు. ఊరు మనదిరా చిత్రం విజయంతో తన సినిమా జీవితంలో రెండవ అంకాన్ని ప్రారంభించాడు.

    2009 మార్చి వరకు నారాయణమూర్తి కథానాయకునిగా నటించిన 26 సినిమాలలో 10 సినిమాలు విజయవంతమయ్యాయి. అవి (విడుదలైన క్రమంలో) - అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దీవిటీలు, లాల్‌సలాం, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా మరియు వేగుచుక్కలు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X