రిచ గంగోపధ్యాయ
Born on 20 Mar 1986 (Age 37) న్యూ డిల్లి
రిచ గంగోపధ్యాయ బయోగ్రఫీ
రిచా గంగోపాధ్యాయ భారతీయ సినీ నటి. తెలుగు, తమిళ్, బెంగాళి సినిమాల్లో నటించారు. 1986 మార్చి 20 న జర్మించారు.
2007లో మిస్ ఇండియా యూఎస్ఏ టైటిల్ గెలుచుకున్న రిచా.. 2010లో ‘లీడర్’ సినిమాతో తన సినీ జర్నీని ప్రారంభించారు. ఈ సినిమాలో రిచా.. రానా దగ్గబాటికి జోడీగా నటించారు. ఆ తర్వాత ‘నాగవల్లి’, ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’, ‘మిర్చి’ సినిమాల్లో నటించారు. చివరిగా రిచా 2013లో వచ్చిన ‘భాయ్’ సినిమాలో నటించారు.
రిచా గంగోపాధ్యాయ చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలా నిలిచిపోయాయి ఆమె అందాలు. తమిళం, బెంగాళీలోని పలు చిత్రాల్లోఆమె నటిచారు. కాగా, 2018 తర్వాత ఉన్నత చదువుల కోసం వాషింగ్దన్ వెళ్లారు. దీంతో కొంత కాలంగా ఆమె సినిమాకు దూరంగా ఉంది. తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడారు.
సంబంధిత వార్తలు