twitter
    CelebsbredcrumbS P Balasubramaniam
    యస్ పి బాలసుబ్రమణ్యం

    యస్ పి బాలసుబ్రమణ్యం

    Singer/Actor/Music Director
    Born : 04 Jun 1946
    ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4 న అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామములో  బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు ఎస్పీ బాలు అసలు పేరు... ReadMore
    Famous For
    ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4 న అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామములో  బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు

    ఎస్పీ బాలు అసలు పేరు శ్రీ ప‌తి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4వ తేదీన నెల్లూరులో పీ సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, నాలుగు చెల్లెలు. అందులో గాయని ఎస్పీ శైలజ, ఎస్పీ వసంత సుపరిచితులు. ఎస్పీ బాలసుబ్రమణ్యం వివాహం సావిత్రితో జరిగింది. ఆయనకు పల్లవి, ఎస్పీ చరణ్ సంతానం ఉన్నారు.

    ప్రముఖ సంగీత దిగ్గజం ఎస్పీ కోదండపాణి శిష్యరికంలో ఎస్పీ...
    Read More
    • 1
      బాలసుబ్రహ్మణ్యం.. ,1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం.
    • 2
      చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుకి.. తొలిసారిగా 1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది.
    • 3
      గాయకుడిగా కెరీర్ ప్రారంభించాక ఆయనకు పెద్ద స్టార్స్ కు పాడే అవకాశం రాలేదు. కేవలం అప్పుడే వస్తున్న అప్ కమింగ్ హీరోలకే పాడే అవకాశం మాత్రమే వచ్చేది. అప్పటికే ఎన్టీఆర్, ఏన్నార్ లకు ఘంటసాల తప్ప ఎవరు పాడినా.. ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి లేదు. అయిన అడపా దడపా ఘంటసాలతో గొంతు కలిపే పాడే అరుదైన అవకాశాలు.. బాలుకు రానే వచ్చాయి. ప్రతిరాత్రి వసంత రాత్రి.. ప్రతిగాలి పైర గాలి.. అంటూ ‘ఏకవీర’ లో అమర గాయకుడు ఘంటసాల తో బాలు ఆలపించిన గానం నేటికి శ్రోతలను హమ్ చేసుకునేలా ఉంటాయి.
    • 4
      ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు పెద్ద దిక్కైయ్యాడు బాల సుబ్రహ్మణ్యం. సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూ..సన్నివేశ బలానికి తగినట్టు నటనను గాత్రంలో ప్రస్పుటంగా ప్రకటించగల గాయకుడు ఎప్పీ. ముఖ్యంగా బాలు సినీ జీవితం ‘శంకరాభరణం’ సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు.. ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నాడు.
    • 5
      తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటాడు బాలూ. హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది.
    • 6
      ‘చెల్లెలి కాపురం’ లో బాలు పాడిన.. చరణ కింకరులు ఘల్లు ఘల్లు మన...కర కంకణములు గల గల లాడగా అంటూ ఎస్పీ తన గొంతులో పలికించిన వేరియేషన్స్ శ్రోతల మదిలో ఇప్పటికీ అలాగే నిలిచిపోయాయి. ఏపాట పాడినా.. ఆ పాటకే అందం వచ్చేంతగా ఆలపించడం బాలు కి తప్పించి మరొకరికి సాధ్యం కాదు. భక్తి గీతాలను సైతం ఎంతో రసరమ్యంగా పాడ్డంలో బాలూ శైలే వేరు. ముఖ్యంగా అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాలలో ఎస్పీ ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటకి ప్రతి ఇంటా వినిపిస్తూనే ఉన్నాయి.
    • 7
      గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, నటుడిగా, టి.వి వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా.. ఇలా బహుముఖ ప్రఙ్ఞను ప్రదర్శించాడు బాలు. సంగీత దర్శకుడిగా యాభై చిత్రాల వరకూ మ్యూజిక్ అందించాడు.
    • 8
      నిర్మాతగా ఆదిత్య369, శుభసంకల్పం, భామనే సత్యభామనే, వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించి తన అభిరుచి చాటుకున్నాడు. బాలసుబ్రమణ్యం పాటలు పాడుతుంటే వినేవారికి మాటలు రావు. ఓ పాపా లాలి చిత్రంలో ‘మాటేరాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు’ అంటూ...బాలూ నటించి, ఆలపించిన బ్రీత్ లెస్ గీతం సంగీతాభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు.
    • 9
      నాలుగు దశాబ్దాల్లో 11భాషల్లో 50వేల పాటలు పాడి గిన్నీస్ రికార్డు నెలకొల్పాడు బాలు. ఆయన అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలకు లెక్కే లేదు.
    యస్ పి బాలసుబ్రమణ్యం వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X