India
  CelebsbredcrumbSai Pallavi
  సాయి పల్లవి

  సాయి పల్లవి

  Actress
  Born : 09 May 1992
  Birth Place : తమిళనాడు
  సాయిపల్లవి ఒక సినీ నటి. సాయిపల్లవి తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామంలొ జన్మించింది. సెంతామరై కన్నన్, రాధామణి తల్లిదండ్రులు. ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. ఈమె చిన్నప్పటి నుండి బెరుకు లేకుండా వేదికల... ReadMore
  Famous For
  సాయిపల్లవి ఒక సినీ నటి. సాయిపల్లవి తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామంలొ జన్మించింది. సెంతామరై కన్నన్, రాధామణి తల్లిదండ్రులు. ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది.


  ఈమె చిన్నప్పటి నుండి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. తెలుగు టెలివిజన్ డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. టిబిలిసి స్టేట్ మెడికల్ కళాశాల, జార్జియాలో వైద్య విద్యనభ్యసించింది. ఫిదా సినిమాలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది.  తమిళ, తెలుగు సినిమాల్లో కథానాయికగా నటించారు.

  వైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో...
  Read More
  • చలో చలో సాంగ్ - విరాట పర్వం
  • విరాట పర్వం మూవీ ట్రైలర్
  • శ్యామ్ సింగరాయ్ మూవీ ట్రైలర్
  • విరాటపర్వం నుంచి ది వాయిస్ ఆఫ్ రవన్నా
  • శ్యామ్ సింగ రాయ్ మూవీ టీజర్
  • రైస్ అఫ్ శ్యామ్ - శ్యామ్ సింగ రాయ్
  • 1
   తమిళనాడులోని ఊటీకి చెందిన సెంతామరై, రాధామణి దంపతుల కుమార్తెనే సాయి పల్లవి. వాస్తవానికి ఆమె పేరు పల్లవి మాత్రమే. కానీ, తల్లి సాయిబాబా భక్తురాలు కావడంతో సాయి పల్లవి అని మార్చారు. ఆమెకు పూజా అనే కవల సోదరి కూడా ఉంది. సినిమాల్లోకి రావడానికి ముందు సాయి పల్లవి.. జార్జియాలో వైద్య విద్యను అభ్యసించింది.
  • 2
   మొదటి నుంచీ మంచి డ్యాన్సర్ కావడంతో సాయి పల్లవికి నాట్యం నేర్పించారు ఆమె తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన ‘ఢీ' అనే డ్యాన్స్ షోలో పాల్గొంది. అప్పుడే తనదైన శైలి నృత్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సమయంలోనే ‘ధూం ధాం' అనే తమిళ సినిమాతో పాటు ‘కస్తూరి మాన్'లో చిన్న చిన్న పాత్రలు చేసింది.
  • 3
   సాయి పల్లవి... తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరిది. కేవలం ఒకే ఒక్క సినిమాతో భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుందామె. చదువు పూర్తయిన వెంటనే ఆమె మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్'లో నటించింది. ఆ సినిమాలో ఆకట్టుకోవడంతో.. తెలుగులో ‘ఫిదా'లో అవకాశం వచ్చింది. ఈ సినిమా వల్ల సాయి పల్లవి ఫేమస్ అయిపోయింది.
  • 4
   సాయి పల్లవి గొప్ప యాక్టర్, డ్యాన్సర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఆమె కెరీర్‌ మాత్రం వివాదాలమయంగా సాగుతోంది. ఇప్పటికే ‘ఎంసీఏ' సినిమా సమయంలో నానితో, ‘పడి పడి లేచే మనసు' టైమ్‌లో శర్వానంద్, ‘కణం' సినిమా అప్పుడు నాగ శౌర్యతో గొడవలు పడిందని ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత వాటన్నింటినీ ఆమె ఖండించిన సంగతి విధితమే.
  • 5
   అన్ని రకాల రసాలను అలవోకగా పండించగలిగే నటి కావడంతో సాయి పల్లవికి మంచి గుర్తింపు వచ్చింది. అదే సమయంలో ఆమె ముద్దు సీన్లు, గ్లామర్ షోకు దూరంగా ఉంటోంది. ఈ కారణంగానే విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్' ఆఫర్‌ను వదులుకుందామే. ఆ సినిమా రిలీజ్ టైంలో ఈ న్యూస్ బయటకు రావడంతో ఇది హాట్ టాపిక్ అయిపోయింది.
  • 6
   సాయి పల్లవి నటించిన సినిమాల్లో చాలా వరకు సూపర్ హిట్ అయినవే ఉన్నాయి. అంతేకాదు, వాటిలో చాలా మూవీలు రికార్డులను క్రియేట్ చేశాయి. వాటిలో ధనూష్‌తో నటించిన ‘మారి 2'లో రౌడీ బేబీ అంటూ సాగే పాట ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటను సాయి పల్లవి కోసమే చూసిన వారు ఎంతో మంది ఉన్నారు.
  • 7
   సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి ‘లవ్‌స్టోరీ' అనే సినిమా చేస్తోంది. ఇది లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక, రానాతో కలిసి ‘విరాట పర్వం' చేయాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఈ మూవీ పట్టాలెక్కడం లేదు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలకు సంతకాలు చేసి చేతి నిండా సినిమాలతో బిజీ అయిపోయింది
  సాయి పల్లవి వ్యాఖ్యలు
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X