twitter

    శరత్‌బాబు బయోగ్రఫీ

    శరత్ బాబు విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. శరత్ బాబు 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో దాదాపు ఐదు దశాబ్దాలుగా నట ప్రయాణం కొనసాగిస్తున్న శరత్ బాబు తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు.ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామవిజేతా వాళ్లు (కె.ప్రభాకర్‌, కె.బాబూరావు) సినీరంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్‌బాబుగా మార్చారు.

    సినీ కెరీర్ 

    హీరోగా శరత్ బాబు తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు. అటుపిమ్మట సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు.

    కన్నెవయసు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, అన్వేషణ, సంకీర్తన, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో శరత్ బాబు నటించారు. ఆయన చివరగా పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో కనిపించారు.

    వ్యక్తిగత జీవితం

    శ‌ర‌త్ బాబు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొద‌టి భార్య పేరు రమాప్రభ. వ‌యసులో త‌న‌కంటే నాలుగేళ్లు పెద్ద అయిన రమాప్రభను శ‌ర‌త్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివాహం అయిన‌ పద్నాలుగేళ్లకు విడాకులతో విడిపోయారు. ఆ త‌ర్వాత రమాప్రభ ఒంటిరిగా ఉండిపోయినా.. శ‌ర‌త్ బాబు మాత్రం స్నేహ ల‌తా దీక్షిత్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరి బంధం కూడా ఎక్కువ‌గా కాలం సాగ‌లేదు. పెళ్లిజ‌రిగిన కొన్నేళ్ల‌కే స్నేహ ల‌తా శ‌ర‌త్ బాబు నుంచి విడిపోయింది. ఆపై శ‌ర‌త్ బాబు మరొక‌రిని వివాహం చేసుకున్నాడు. అయితే ఆయ‌న మూడో భార్య‌ ఎవ‌రు, ఆమె పేరేంటి అన్న‌ది ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు

    అవార్డులు 

    వీరు 1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మొదటిసారి సీతాకోక చిలుక, రెండవసారి ఓ భార్య కథ, మూడవసారి నీరాజనం సినిమాలలో తన నటనకు లభించాయి.

    మరణం 
    అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న శరత్‌బాబు (71) హైదరాబాద్‌లోని చికిత్స పొందుతూ 22/5/2023 సోమవారం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శరీరం మొత్తం విషతుల్యం (సెప్సిస్‌) కావడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలు దెబ్బతిని ఆయన మరణించారని వైద్యులు వెల్లడించారు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X